తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి  దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకాదటిగా సీఎంగా పనిచేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. కొత్త కొత్త పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం తీవ్రమైన అప్పుల్లోకి తీసుకెళ్లారు. అలాంటి కేసీఆర్ కేవలం కుటుంబ పాలన తప్ప ఇంకా ఏ వ్యక్తి, ఏ మంత్రికి కూడా  స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆ విధంగా రాచరిక పాలన చేసిన కేసీఆర్ ను రెండుసార్లు ప్రజలు గెలిపించారు. అయినా తీరు మారకపోవడంతో మూడవసారి  గట్టిగా పట్టుకొని నేలకేసి కొట్టారు. 

దీంతో కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది.  కేవలం 39 సీట్లకే పరిమితమై  ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇదే తరుణంలో 64 సీట్లు సంపాదించినటువంటి కాంగ్రెస్  నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వారు ఎన్నికలకు ముందు ఇచ్చి నటువంటి ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మూడు గ్యారెంటీలు అమలు చేసి, నాలుగో గ్యారెంటీ కూడా అమలు చేసే దిశగా దూసు కెళ్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర ఓడిపోయిన సీనియర్ నాయకులు  కాంగ్రెస్ పాలన మెచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు.

ఇదే తరుణంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరుణంలో మరో ఎమ్మెల్సీ  కాంగ్రెస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో  భేటీ అయ్యారట. ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారట. ఇదే తరుణంలో బండా ప్రకాష్ పార్టీ మారబోతున్నారని వార్తలు ఉపందుకున్నాయి. ఇక వీరే కాకుండా పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ కు టచ్ లోకి రావడానికి సిద్ధమైపోతున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: