ఈరోజు పవన్ కళ్యాణ్ తనని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ప్రజలకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి మరి వారికి కృతజ్ఞత తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఈ సభలో చాలా ఘాటైన వ్యాఖ్యలు సైతం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా సభలో కొంతమంది కార్యకర్తలు అడ్డుపడ్డ నేపథ్యంలో వారిని సున్నితంగా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రేమగా మాట్లాడుతున్నానని అలుసు తీసుకోవద్దు అలుసుగా చూస్తే కచ్చితంగా అంచు చూస్తాను అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్.. మీలాంటి వారికి జగన్ లాంటి వారే కరెక్ట్ అంటూ హెచ్చరించారు.


మాట్లాడితే కొట్టే వారి దగ్గరే భయంగా ఉంటారని ప్రేమగా మాట్లాడితే కచ్చితంగా చులకన చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.. తనకు భయమే లేదని తనతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడితే వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నియమాలు ప్రోటోకాల్స్ వంటివి పాటిస్తున్నానని అలుసుగా తీసుకుంటే మాత్రం అసలు సహించేదే లేదని తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఎవరైనా గెలిచాము కదా అని తల ఎగిరేయొద్దు అంటూ తెలియజేశారు.


వైసీపీకి 11 సీట్లు వచ్చిన ఒక్కటి సీటు వచ్చిన వారిపైన దాడులు దిగడం సరైన పద్ధతి కాదంటూ కూడా తెలిపారు.. వైసీపీకి 151యొక్క సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టిందని వారు ఆ పరీక్షలు ఓడిపోయారు అంటూ అది గుణపాఠంగా తీసుకోవాలి అంటూ తెలిపారు. తనకు వ్యక్తిగత కక్షలు అసలు లేవని తప్పు చేసిన వారిని చట్టమే శిక్షిస్తుంది అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేనకు వైసీపీకి తేడా ఇదే అని కూడా తెలిపారు జనసైనికులు క్రమశిక్షణగా ఉండాలని తెలియజేశారు తనకు తిట్టడానికి కూడా సమయం లేదని చాలా పని ఉంది అంటూ తెలియజేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పాటిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: