ఏ రాజకీయమైన సరే ఒక్కొక్క రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటిది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఒక్కసారిగా దూసుకు రావడం.. 100% స్ట్రైక్ రేట్ తో రావడం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. అదే సందర్భంలో తన వాళ్లకు ప్రాధాన్యత విషయంలో కూడా కల్పించడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్ మంత్రి.. మరొకటి నాదెండ్ల మనోహర్ మంత్రి పదవి ఇచ్చారు. 21 మంది మంత్రులలో ఇద్దరు క్యాబినెట్లు పదవులు ఇచ్చారు. మొత్తం మీద ముగ్గురికి మూడు పదవులు ఇవ్వడం జరిగింది.



పార్లమెంటు సభ్యులలో ఒకరు బాల సౌర్యకి.. ఫ్లోర్ లీడర్ గా అవకాశాన్ని కల్పించారు. ఇక మిగిలిన వాళ్లలో మిగిలిన ఎమ్మెల్యేలుగా ఉన్న 18 మందిలో  మరో ఇద్దరికి ఇప్పుడు అవకాశం లభించేలా కనిపిస్తోందట. అసెంబ్లీ మొదటి రోజున మత్స్యకారుడుగా కులవృత్తుడిగా ఆశ్చర్యపరిచినటువంటి బొమ్మిడి నాయకర్ కి.. అలాగే శ్రీధర్ ఇద్దరికీ కూడా.. విప్ లుగా అవకాశం ఇవ్వాలి అంటూ స్పీకర్ కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఇద్దరూ విప్ లు అవుతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురికి అదనంగా.. మరో ఇద్దరికి అవకాశం లభిస్తుంది


సాధారణంగా విప్ అనగానే ప్రోటోకాల్ వస్తుంది, వారు కూడా క్యాబినెట్ ర్యాంకు హోదాల ఉంటారు. అన్నిటిలో కూడా సమానంగానే చూస్తూ ఉంటారు. అలాగే తనను నమ్ముకున్న వాళ్ళని బడుగు బలహీనవర్గాల నుంచి వచ్చిన వారికి ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఈ రోజున తన నిలబడినటువంటి పిఠాపురం నియోజవర్గానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమయ్యారు.. అలాగే ఎవరు ఎలాంటి ఆగడాలు చేసినా కూడా సహించమని విధ్వంసకమైన పాలన చేయకూడదంటూ అందరికీ వారిని ఇచ్చారు.. జనసైనికులు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతోనే ముందుకు వెళ్లాలని తెలియజేశారు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: