* 2019 గెలుపుతో ఆకాశమంత ఎత్తుకెళ్లి 2024 ఓటమితో పాతాలానికి పోయిన జగన్!
* సీఎం అంటే ఎలా ఉండకూడదో చంద్రబాబుకి నేర్పిన జగన్!
* మరి బాబు జగన్ ఓటమిని గుణపాఠంలా తీసుకుంటాడా?

( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) : ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 164 సీట్లు గెలిచి కూటమి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాత్ర గెలుపులో కీలకం. ఆయన ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత ఎన్నికలలో  151 సీట్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ వైసీపీ ఈ సారి  కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి చెత్త రికార్డ్ నమోదు చేసింది. వైసీపీ నుంచి ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తప్ప మిగిలిన మంత్రులందరు దారుణంగా ఓడిపోయారు. గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో తెలిసిందే. జగన్ తన మంత్రులను ప్రజా సేవకి కాకుండా కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టేందుకే పెట్టుకున్నట్లు ఉంది. అంత ఘోరంగా వారు వ్యవహారించారు.

జగన్ నియమించిన వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండటంతో సంబంధిత నాయకులకు తమ నియోజకవర్గంలో పని లేకుండా పోయింది. జనాలకి ఏ పధకం కావాలన్నా వాలంటీర్ పై మాత్రమే ఆధార పడాల్సి వచ్చింది. వాలంటీర్లు ప్రభుత్వ పనులు సరిగ్గా జరిగేందుకు జగన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ.. దీనితో కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు పని తగ్గి మొద్దు బారిపోయి బాగా సుఖం మరిగారు. జగన్ సీఎం అయినా కూడా ప్రభుత్వం అంతా సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి సలహాదారులు నడిపారనే విమర్శలు వచ్చాయి.జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ మెప్పు పొందటం కోసం అయన చుట్టూ చేరి కేవలం భజన మాత్రమే చేసే వారు. పైగా అలాంటి వారికే జగన్ ప్రాధన్యతను ఇచ్చారు. దీనితో ఈ ఎన్నికలలో జగన్ చాలా దారుణంగా ఓడిపోయారు. మరి ఇంత దారుణంగా ఓడిపోయిన జగన్ మారతాడో లేడో తెలీదు కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం శత్రువుగా కంటే గుణ పాఠం లాగా తయారు అయ్యాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ బాబు గెలవాలంటే జగన్ లా ఉండకుండా ఆయన్ని ఓ గుణపాఠం లాగా తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. మరి బాబు జగన్ ని గుణపాఠంలా తీసుకొని ఈ 5 ఏళ్ళు జాగ్రత్త పడతారో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: