- బాబు పాలన ఏపీకే తలమానికం.!
- ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు.
- వైసీపీని లేకుండా చేయడమే లక్ష్యమా.?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడైనా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పార్టీలలో టిడిపి, వైసిపి మాత్రమే మెయిన్ పార్టీలుగా ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా అద్భుత మెజారిటీ సాధించి ఏపీలో కీలక పార్టీగా మారింది. ఈ విధంగా జనసేన కూడా ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఆయన చేతులారా చేసుకున్న తప్పులే పార్టీని చతికిల పడేలా, అధికారం పోయేలా చేశాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో ఉండాలి తప్ప, అధికారం రాగానే నేనే రాజు నేనే మంత్రి అంటే మాత్రం ప్రజలు సహించరు. రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తేనే అటు ప్రజల్లో, ఇటు పార్టీలో కూడా ఆదరణ పొందుతారు. కానీ పైకి నవ్వులు లోపల కత్తులు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన చేసుకువచ్చారు. కానీ ఆయన నవ్వులను ఎవరు నమ్మలేదు. చివరికి ప్రజలు ఛీ కొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.

జగన్ బాబుకు పాఠాలు నేర్పాడా.?

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కే కాదు. కానీ జగన్ ఆయన రాజకీయ అనుభవానికి కూడా వ్యాల్యూ ఇవ్వకుండా, కొంతమంది అసమర్ధ నేతలను పక్కన పెట్టుకొని  చంద్రబాబును  హేళన చేసి ప్రజల్లో మైనస్ అయ్యాడు. అధికారం రాగానే అహంకారం పెరగకూడదు అంటారు. కానీ జగన్ కు మాత్రం విపరీతమైన అహంకారం పెరిగిపోయింది. దీంతో తప్పుల మీద తప్పులు చేశాడు. ఏ నాయకుడైతే ప్రజలు  ఛీ కొట్టారో ఆ నాయకులనే తన దగ్గర పెట్టుకున్నాడు. ఏ నాయకులైతే అరాచకాలు చేస్తూ వచ్చారో వారినే నమ్మాడు. చివరికి వారి వల్లే దారుణమైన ఓటమిపాలయ్యాడు.  కానీ వయసులో చిన్న వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి పాలన ఎలా చేయాలో  నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు.


జగన్ చేసిన తప్పులన్నింటినీ  తాను చేయకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నాడు. జగన్ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అన్నింటిని అందించాడు.  కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీ కార్యకర్తల నుంచి మొదలు  మంత్రుల వరకు అందరూ పార్టీ పథకాలను ప్రజలకు అందించాలని స్వయంగా మీరే ప్రతి ఇంటికి వెళ్లాలనే సూచన చేశారు. అంతేకాదు పొద్దున లేస్తే ప్రజల్లో ఉండాలని ఆంక్షలు పెడుతున్నాడు.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వాటిని తీర్చాలని చెబుతూ వస్తున్నాడు.  ఏకంగా సీఎం చంద్రబాబు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వాలంటరీ వ్యవస్థ అనేదాన్ని మర్చిపోయేలా చేశారు. అంతేకాదు కార్యకర్తలకు ఎంతో భరోసా ఇస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేయాలని  వారికి చెబుతున్నాడు. ఇలా జగన్ ఏ విధంగా కార్యకర్తలను విస్మరించాడో, చంద్రబాబు దానికి వ్యతిరేకంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ ప్రజలకు నాయకులకు వారధిగా చేసుకుంటున్నాడు. ఈ విధంగా జగన్ నుంచే చంద్రబాబు పాఠం నేర్చుకున్నాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: