మొన్నటికి ముందు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది కూటమి. ఏపీలో అధికారాన్ని చేపట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయిన నేపథ్యంలో.. ఇక అన్ని శాఖలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇలా  నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు.. అటు మాజీ సీఎం జగన్ చూసి కొన్ని విషయాలు నేర్చుకోవడం మంచిది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


 అదేంటి ప్రజల మనసులు గెలుచుకుని ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు ఓడిపోయిన జగన్ ను చూసి నేర్చుకోవాల్సింది ఏముంటుంది.. జగన్ పాలన నచ్చకే కదా వైసీపీని ఏపీ ప్రజలు ఓడించారు. ఇంకా ఆయనను చూసి చంద్రబాబు ఏం నేర్చుకుంటారు అనుకుంటున్నారు కదా. నేర్చుకోవాలి అయితే జగన్ పాలన చూసి మరోసారి అలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయాలను చంద్రబాబు నేర్చుకోవాలి. మితిమీరిన అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టి ప్రజలపై అప్పుల భారం మోపారు. ఇదే వైసిపికి మైనస్ గా మారింది.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో  ఇలా చేయకూడదు అని జగన్ ను చూసి నేర్చుకోవాలి.. సంక్షేమ పథకాలతోనే గెలుస్తామంటే ప్రజలు బుద్ధి చెబుతారు అన్న విషయాన్ని జగన్ ఓటమి చూసి చంద్రబాబు తెలుసుకోవాలి.


 జగన్ లా కార్యకర్తలు, నేతలకు కాకుండా వాలంటీర్లకే ప్రాధాన్యత ఇచ్చి వారితోనే అన్ని పనులు చేయించుకుంటే పార్టీకి నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని జగన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి.. అధికారం చేతిలో ఉంది కదా అని హిస్టారీతిలో ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని.. జగన్ కు జరిగింది చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. ఇలా ఓడిపోయిన జగన్ నుంచి పాలన ఎలా ఉండకూడదు అనే విషయాలను నేర్చుకుని.. ఎలా ఉండాలి అని చంద్రబాబు చేసి చూపించాలి. అలా కాకుండా.. మళ్లీ జగన్ లాగే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి రాష్ట్ర అభివృద్ధిని మరిచిపోతే మాత్రం ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పట్టిన గతే టిడిపికి పట్టడం ఖాయమని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: