•పెన్షన్ విషయంలో జగన్ చేసిన తప్పే బాబు కూడా..

* పగ ప్రతీకారాలకు పోయి భవనాలను కూల్చివేత

•ప్రజాధనం నాశనం చేయడమే లక్ష్యమా..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నాడు గత సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల విషయంపై వారి ధనం విషయంపై గందరగోళం చేస్తున్నారని.. ప్రజాధనం వృధా చేస్తున్నారని.. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని  పెద్ద ఎత్తున గళం విప్పి ప్రచారాలు నిర్వహించారు..  అయితే నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది. ప్రజలను మభ్యపెట్టే తీరులో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అనే విషయం స్పష్టం అవుతోంది.

ముఖ్యంగా పెన్షన్.. ఇప్పటికే పెన్షన్ నిన్న అనగా జూలై 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి అందించారు.. అయితే ఇక్కడ ఏకంగా 7000 రూపాయలను వృద్ధాప్య పింఛన్ గా,  వికలాంగులకు 6000 రూపాయలను అందించిన విషయం తెలిసిందే.. ఇక రేపటి నెల నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.4000 ప్రకటించారు.. అయితే ఈ నెల ఏకంగా 7000 రూపాయలను అందించడంతో అర్హులు ఆనందపడినా ఇంత ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరొకవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బిల్డింగులను కూల్చి వేస్తున్నారు.. దీనికి తోడు 108 వాహనాలను , రేషన్ వెహికల్ తో పాటు చెత్త వెహికల్స్ ని ఉపయోగించుకోకుండా పక్కన పడేస్తున్నారు. ఇవన్నీ ఉపయోగం లేకుండా అవుతున్నాయి. పైగా ఇవన్నీ కూడా ప్రజాధనానికి నష్టాన్ని కలిగిస్తున్నాయి.. ఉన్న వనరులను ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధి పరచాలే కానీ గత ప్రభుత్వంలో చేపట్టారు.. వారి జండా రంగులు ఉన్నాయి.. వారి పేరు ఉంటుంది.. అన్న సిల్లీ కారణాలకు పోకుండా.. కొంచెం పెద్దవారి లాగా ఆలోచించి... వాటిని తిరిగి ఉపయోగించుకుంటే ప్రజాధనానికి ఎటువంటి లోటు ఉండదు. పైగా అమరావతి ఇప్పుడు రాజధానిగా ప్రకటించారు.. ఇలా డబ్బులు అన్ని వృధా చేసి ఆ నగరాన్ని రాజధాని చేసే పనిలో పడ్డారు ..కాబట్టి ఇక్కడ డబ్బు ఆదా చేస్తూ ...అక్కడ నగరాన్ని మరింత అభివృద్ధి పరిస్తే అటు ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త రాజధాని తక్కువ ఖర్చులోనే సిద్ధం అవుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు ఆలోచించడం లేదు.. కేవలం పగ ప్రతీకారాలపైనే ఆయన ప్రవర్తిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. కనీసం వేటిని కూల్చకుండా అన్ని వనరులను ఉపయోగించుకొని.. అటు ప్రజలకు ఇటు రాష్ట్రానికి అభివృద్ధి చేకూర్చాలని రాజకీయ నిపుణులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: