* ఐదేళ్లలో జగన్ చేసిన తప్పులు అందరికీ గుణపాఠం

* జగన్ నుంచి విలువైన గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు

* ఆ తప్పును రిపీట్ చేసే అవకాశం లేదు  

(ఏపీ- ఇండియా హెరాల్డ్)

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి చేసిన చాలా తప్పులు రాజకీయ నేతలకు విలువైన గుణపాఠాలు అయ్యాయి. జగన్ చేసిన తప్పులు చిన్నవి కావు. అందుకే ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనమయ్యారు. జగన్ గత ఐదేళ్ల పాలనలో పిచ్చి పనులు చేస్తూ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి దారి తీశారు. అయితే జగన్ చేస్తున్న తప్పులు ఏంటో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు చాలా చక్కగా విశ్లేషించుకున్నారు. ఆ తప్పులను తన పరిపాలనలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతోంది. ఈ 20 రోజుల్లోనే బాబు చాలా మంచి పనులు చేశారు. అన్ని తప్పులను సరిదిద్దుకుంటూ తనలోని కొత్త రాజకీయ నేతను చూపించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫుల్ పవర్ ఇచ్చారు. జగన్ మాత్రం అలా చేయలేదు. మొత్తం వాలంటీర్ వ్యవస్థకే పవర్స్ అందించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వెళ్లి పని చేయించుకోవాల్సిన అవసరాన్ని తగ్గించారు. దీనివల్ల వాళ్లు డమ్మీలుగా మిగిలిపోయారు.

ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వీక్ అయిపోయింది. కేడర్ బాగా దెబ్బతిన్నది. ప్రజలకు వైసీపీతో కనెక్షన్ కట్ అయిపోయింది. దీనివల్ల ఎన్నికల ప్రచార సమయంలో జగన్ కు మంత్రులు, నేతలు, ప్రజల నుంచి అలాంటి సపోర్టు అందలేదు. పైగా ఈ వైసీపీ అధినేత చాలా మంది కీలక నేతలను తీసేసి వేరే వాళ్లని పెట్టుకున్నారు. తనను మాత్రమే చూసి జనాలు ఓట్లు వేస్తారన్నట్లు ప్రవర్తించారు. కానీ ఇది ఎంత పెద్ద తప్పో చంద్రబాబు అర్థం చేసుకున్నారు. అందుకే జులై ఒకటో తేదీన మంత్రులను ఎమ్మెల్యేలను అందరిని పిలిపించి వారి చేతనే లబ్ధిదారులకు పింఛను అందించారు.

ప్రభుత్వంలో మీరు భాగమే మీరు ముఖ్యమే నాకు అని ఆయన ఈ చర్యతో చెప్పకనే చెప్పారు. దీనివల్ల చాలామంది సంతోషించారు. ప్రజలు కూడా నేతలకు బాగా దగ్గరయ్యారు. రేపొద్దున వీళ్ళే కాబట్టి అన్ని ఇచ్చింది వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఉంది. వీళ్ళు అందరితో మమేకం అవ్వడం వల్ల ఓటు అడగటం ఓట్లు తమ వైపు పడేలా చేసుకోవడం సులభం అవుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి అడిగితే ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఐదేళ్లపాటు దగ్గరుండి మరీ అన్ని అందించిన వారిని కాదని వేరే వారికి ఓటేసే అవకాశం ఉండదు. చంద్రబాబు ప్రజలకు చాలా దగ్గరగా మెలుగుతున్నారు. జగన్ మాత్రం ఎవరితోనూ కలవలేదట. ఈ అహంకారమే అతని రాజకీయ భవిష్యత్తును కాల్చుకుపోయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: