ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత... చాలా కష్టాలు అనుభవిస్తున్నారు.  గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి... ఇబ్బందులు పెట్టిన  సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ మోహన్ రెడ్డి పై రివేంజ్ తీర్చుకుంటున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.


మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కారు. తాడేపల్లి లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను... పూర్తిగా తొలగించాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీని తొలగించారు పోలీసులు.


సెక్యూరిటీ లో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన... హైడ్రాలిక్ బోలార్డ్స్, టైర్ కిల్లర్స్ ను కూడా తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం. ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటికి పార్కు విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టులను కూడా... కూటమి ప్రభుత్వం తొలగించాలని ఆదేశించడంతో అధికారులు వాటిని తొలగించారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో... జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ  కోసం దాదాపు 1000 మంది సిబ్బంది ఉన్నారని వార్తలు వచ్చాయి.

 కేవలం తాడేపల్లి లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ దాదాపు 300 మంది  పోలీసులు సెక్యూరిటీ గా ఉండేవారట. అయితే జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోవడంతో.. సెక్యూరిటీ సంఖ్య బలాన్ని కూడా తగ్గించేసింది చంద్రబాబు సర్కార్. ఇది ఇలా ఉండగా... ఇప్పటికే తాడేపల్లి లో వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోపే ఈ పని చేపట్టింది.  ఇక మరో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి మరిన్ని కష్టాలు వస్తాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: