దేశంలోని రాజకీయ చాణిక్యుల్లో  చంద్రబాబు కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన సీఎంగా రికార్డు సృష్టించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి సీఎంగా కూడా చరిత్రకెక్కారు.  అలాంటి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రజాక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఉంటారు. మొత్తానికి ఈయనను పనిమంతుడు అని చెప్పవచ్చు. అలాంటి చంద్రబాబు 1995లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  తన మార్కు పాలన చూపించారు. ఆ సమయంలో ఆయన 45 సంవత్సరాలు ఉన్నాడు. కనీసం రోజులో 20 గంటలకు పైగానే పనిచేసే వారట. ఇక ఆయన నిద్రపోయేది కేవలం నాలుగు గంటలు ఒక్కోసారి ఐదు గంటలు మాత్రమే. అలా పాలనపై దృష్టి పెట్టాడు కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతగా డెవలప్ అయింది. 

ఇక చంద్రబాబు ఎక్కువగా ఉద్యోగులపై దృష్టి పెడతారు.  ఉద్యోగులు వారి టైమింగ్ లో, ప్రజలకు ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేయాల్సిందే అని అల్టిమేట్ జారీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా  ఏదైనా పని పూర్తికాకుంటే పూర్తయ్యే వరకు చేసి వెళ్ళాలని అంటుంటారు. 1995లో ఆయన సీఎం అయినప్పుడు  ఉద్యోగులను ఉరికించారని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి రాజధానిలో పనిచేసే ఉద్యోగుల వరకు అందరూ పనిలో ఉండాల్సిందే.  ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్ గా తనకు తెలియాల్సిందే అనేది ఆయన పాలసీ. ఊర్లో పనిచేసే కార్యదర్శి నుంచి మొదలు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వరకు అందరు అలర్ట్ గా ఉంటేనే గ్రామంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని, పాలన సక్రమంగా అందుతుందని ఆయన భావన.

అంతేకాకుండా  ఏమాత్రం కరప్షన్ లేని ఉద్యోగులను తయారు చేశాడు. ప్రజల నుంచి రూపాయి తీసుకోవాలంటేనే వణికి పోయేవారు. అలా 1995లో అద్భుతమైన పాలన అందించిన చంద్రబాబు నాయుడు  2024లో నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆయన అదే దూకుడు వ్యవహరిస్తానని  చెప్పకనే చెబుతున్నారు.  ముఖ్యంగా ఉద్యోగులు సిట్రైట్ అయితే పాలన బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు సోమరులుగా మారారని,  అదంతా మార్చేస్తానని చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ఏజ్ 45 సంవత్సరాలు, ప్రస్తుతం 75 సంవత్సరాలు ఉన్నాడు. అయినా అదే దూకుడుతో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. మరి చూడాలి 2029 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: