తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేబినెట్ విస్తరణ పై... రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు, ప్రభుత్వ విప్, పిసిసి అధ్యక్ష పదవి అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులపై... కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చోప చర్చలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఈ విషయాలపై చర్చించారు. ఇక మరోసారి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.


ఈ సందర్భంగా... తెలంగాణ కేబినెట్ విస్తరణ పై సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు చేయనున్నారట రేవంత్ రెడ్డి. మరో ఆరుగురికి కేబినెట్లో ఛాన్స్ ఉంది.   ఇప్పుడు చేసే విస్తరణలో కేవలం నలుగురికి లేదా ఐదుగురికి ఛాన్స్ ఇస్తారని సమాచారం అందుతుంది. మిగిలిన పదవిని పక్కకు పెడతారట.  మళ్లీ ఎప్పుడైనా ఆ పదవులను కూడా భర్తీ చేయనుందట కాంగ్రెస్. అయితే ప్రస్తుతం.. ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు ఎవరికి మంత్రివర్గంలో వస్తానం లేదు.

 

కాబట్టి ఈ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. రంగారెడ్డి విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి పేరు మొదట వినిపిస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. అతనికి అసలు ఛాన్స్ ఇవ్వరు  అని అంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్ నుంచి.... సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కచ్చితంగా ఈసారి మంత్రి అవుతారని తెలుస్తోంది.

 

అటు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకట స్వామికి కచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు. ఆయనకు రాకపోతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తోంది. ఇటు ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన పదవి ఇవ్వకపోతే పార్టీ మారతారని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా బల్మూరి వెంకట్ కు కూడా ఈసారి పదవి రాబోతున్నట్లు తెలుస్తోంది.  అటు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేయనున్నారట.  ఇక అటు సీతక్కకు హోం శాఖ ఇస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: