ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేశారు. ముఖ్యంగా అందులో అన్నా క్యాంటీన్లు వంటివి ఓపెన్ చేయడం జరిగింది.. దీంతో అందుకు తగ్గట్టుగా పనులు కూడా ప్రస్తుతం ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల లో ఈ విషయాలను తెలియజేస్తూ నిత్య అన్నదానం కింద అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లను ఓపెన్ చేయాలి అంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.


ఒకవైపు చంద్రబాబు అన్న క్యాంటీన్లను ఓపెన్ చేయిస్తూ ఉండగా మరొకవైపు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరుతోనే ఓపెన్ చేయాలి అంటూ తెలుపుతున్నారు. ఇటి వలె కాకినాడలో జరిగిన జనసేన నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. డొక్కా సీతమ్మ సేవలను మనం నిత్యం స్మరించుకోవాలని అలాగే పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్లే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అంటూ తెలియజేశారు. సమాజానికి మేలు చేయాలని ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని వెల్లడించారు.


దేశం కోసం తాను ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటానని తన ప్రాణం ఉన్నంతవరకు పిఠాపురం కోసమే పని చేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్. పిఠాపురం పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పుడు తాను కచ్చితంగా గెలిచానని తెలియజేశారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు ఎలాంటి ఆగడాలకు పాల్పడిన వెనక్కి తగ్గేదే లేదని.. లా అండ్ ఆర్డర్ ను కాపాడాలంటే కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తాను ఎలాంటి విషయంలో కూడా భయపడే వ్యక్తిని కాదు అంటూ తెలియజేయడం జరిగింది. మరి ఉపయోగ గోదావరి జిల్లాలలో అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తారా లేకపోతే డొక్కా సీతమ్మ పేరుతోనే క్యాంటీన్లను ఓపెన్ చేస్తారా అనే విషయం ఇప్పుడు సందిగ్ధంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: