2023 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. దానితో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అత్యంత కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 
ఇక 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు అయింది.

అలా విడిపోయిన సమయంలో అనేక విభజన హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్న వీటిలో కొన్ని పరిష్కారం కాలేదు. దానితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజన హామీలు ఇప్పటికీ కొన్ని నెరవేరలేదు. మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.

వాటి వల్ల జనాలకు ఎంతో మంచి జరుగుతుంది. ఒక వేళ మీరు సిద్ధంగా ఉన్నట్లు అయితే ఈ నెల 6వ తేదీన ముఖాముఖి చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని చంద్రబాబు , రేవంత్ కి ఒక లేఖ రాశారు. తాజాగా రేవంత్ ఆ లేఖకు ప్రతిస్పందిస్తూ రేవంత్ చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అందులో భాగంగా విభజన హామీలపై చర్చల ప్రతిపాదనకు స్వాగతిస్తూ ఈ నెల 6 వ సాయంత్రం భేటీకి సిద్ధం అని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు రాసిన లేఖను నేను చదివాను అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దాం అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: