తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత... కెసిఆర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కెసిఆర్ కూతురు... అరెస్టు కావడం, కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం... అలాగే.. కెసిఆర్ పై వరుసగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టడం... మనం చూస్తున్నాం. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకు గులాబీ పార్టీ పడిపోవడం.... కెసిఆర్ ను మరింత వేధిస్తున్నాయి. అయితే... ఏమాత్రం మనోధైర్యం కోల్పోకుండా... గులాబీ నేతల్లో మనోధైర్యం నింపుతున్నారు కేసీఆర్.

 గ్రామస్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు అందరినీ తన ఫామ్ హౌస్ కు... పిలిపించుకుంటున్నారు కెసిఆర్. ఈ సందర్భంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై దిశా నిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇక తాజాగా జడ్పీ చైర్మన్ లతో సమావేశమైన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని.. మరో 15 సంవత్సరాల పాటు మనం పవర్ లో ఉంటామని ఆయన తెలిపారు. దానికోసం ప్రత్యేకంగా రూపకల్పన కూడా చేస్తున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్. మనం అధికారంలోకి వచ్చాక వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియాంబరిమెంట్స్ పథకాల పేర్లు ఎక్కడ మార్చలేదని... వాటిని అలాగే ఉంచామని గుర్తు చేశారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం కెసిఆర్ జాడనే లేకుండా... చేసేందుకు పేర్లు మారుస్తున్నాడని... తాను తెచ్చిన తెలంగాణలో... అడుగడుగునా కేసీఆర్ ఉన్నాడని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చిన ప్రతి నేత గెలుస్తారని ఆయన జోష్యం చెప్పారు. పవర్ లో ఉన్నా లేకున్నా మనం ప్రజల కోసం పనిచేయాలని... వచ్చే రెండు సంవత్సరాలలో నియోజకవర్గాల సంఖ్య 160 కి పెరిగే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్. ఎవరు అధైర్య పడకూడదని... పడి లేచిన సింహంలా దూసుకు వస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: