రైతులకు ఉచిత కరెంట్ అనే పథకాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత కరెంటు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గెలవక ముందే అధికారంలోకి వచ్చినట్లు అయితే ఉచిత కరెంటును రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక గెలిచే అధికారంలోకి వచ్చాక చెప్పిన విధంగానే రైతులకు ఉచిత కరెంటును తీసుకువచ్చారు.

ఇక మొదటగా తక్కువ గంటల పరిమితితో ప్రారంభమైన ఉచిత కరెంటు పథకం ప్రభుత్వాలు మారిన కొద్ది , సంవత్సరాలు గడుస్తున్న కొద్ది గంటలు పెరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలలో ఉచిత కరెంటు అమలులో ఉంది. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా 24 గంటల ఉచిత కరెంటు ను ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 2014 వ సంవత్సరం కూడా 24 గంటల ఉచిత కరెంటును ఇచ్చింది.

ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం మళ్లీ కూడా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను రైతులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే రైతులకు కరెంటు విషయంలో ఎలాంటి బాధలు కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్ ఫారం లను చెక్ చేయడం. అలాగే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగినట్లు అయితే వెంటనే వాటిని పునరుద్ధరించడం , గాలి వానల వల్ల ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగిన , పడిపోయిన వాటిని చాలా తక్కువ వ్యవధిలోనే మళ్లీ పునరుద్ధరించడం. ఇలాంటి పనులను వేగవంతంగా చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉచిత కరెంటు విషయంలో కలగకుండా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: