*చెత్తపన్ను ద్వారా ఏడాదికి ఏకంగా 200 కోట్ల రాబడి
*సంస్కరణలో భగంగా చెత్త పన్ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో బీజేపీ ,టీడీపీ ,జనసేన కూటమి ప్రభుత్వం ఏకంగా 164 సీట్లు సాధించి సంచలన విజయం సాధించింది . గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకుంది.నాలుగో సారి సీఎం గా భాద్యతలు స్వీకరించిన చంద్రబాబు పలు సంస్కరణలపై దృష్టి పెట్టారు.గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు విమర్శించారు.నిత్యావసర వస్తువుల ధరలన్నీ గత ప్రభుత్వ హయాంలో చుక్కల్ని తాకాయని పెరిగిన ధరలతో ప్రజలు ఎంతో అవస్థ పడుతుంటే జగన్ తన ప్యాలెస్ లో రాజభోగాలు అనుభవించారని చంద్రబాబు విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో మీకోసం ఎన్నో బటన్ లు నొక్కాను.నాకోసం ఈ ఒక్క బటన్ నొక్కండి అని ప్రచారం చేసిన జగన్ కు ప్రజలు కోలుకోలేని బటన్ ను నొక్కి సాగనంపారు.అధికారంలో వున్న ఐదేళ్ళలో ఎన్నడూ చూడని విధ్వసం సృష్టించారు.దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో చెత్త పన్ను విధించింది అని చంద్రబాబు విమర్శించారు. చెత్త సేకరణ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం పట్టణ,స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 చొప్పున ఏటా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది.అలాగే ఈ పన్నును తప్పనిసరిగా వసూలు చేయాల్సిందే అని మున్సిపల్ సిబ్బందికి టార్గెట్స్ కూడా పెట్టింది.దీనితో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
దీనితో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు.ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.అలాగే పలు సంస్కరణలలో భాగంగా సీఎం చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సమస్యను తీర్చేందుకు ప్రజాదర్బార్ కూడా ఏర్పాటు చేసారు.మంత్రులందరూ ప్రజలకు అందుబాటులోనే ఉండాలని ఆదేశించారు.చెత్త పన్ను రద్దు ,అలాగే పలు సంస్కరణలలో భాగంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.