- ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే గుజ‌రాత్‌తో మోడీకి టెన్ష‌న్‌
- తెలంగాణ‌కు హైద‌రాబాద్‌.. ఏపీకి ఆర్థిక వ‌న‌రులందించే సిటీ లేదు..?
- హోదా ఇస్తే చాలు ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

గ‌త నాలుగు రోజులుగా.. ఏపీలో ప్ర‌త్యేక హోదా విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. మేధావులు త‌మ త‌మ చానెళ్ల‌లో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశం.. వ‌స్తే.. ఎలా వినియోగించుకోవాల‌న్న అంశంపై వారు లెక్చ‌ర్లు ఇస్తున్నారు. దీంతో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకు?  ఎలా వ‌స్తుంది? వ‌స్తే.. ఏం జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చగా మారింది. ఈ విష‌యం కొంత లోతుగా చూస్తే.. ప్ర‌త్యేక హోదా అనేది.. ఏపీకి  కీల‌క‌మే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న కీల‌క న‌గ‌రం హైద‌రాబాద్‌.. తెలంగాణ‌కు ప‌రిమిత‌మైంది.


దీనికి ముందు.. ఏపీలోని కోస్తా, సీమ‌, ఉత్త‌రాంధ్ర స‌హా.. అన్ని ప్రాంతాల కు చెందిన ప్ర‌జ‌లు.. హైద‌రాబాద్‌లో ఆస్తులు పెంచేందు కు ప్ర‌యత్నించారు. అక్క‌డే ఉన్నారు. వ్యాపారాలు కూడా చేశారు. దీంతో హైద‌రాబాద్ బ‌ల‌మైన రాజ‌ధాని న‌గ‌రంగా ఏర్ప‌డి.. తెలంగాణ‌కు ఆర్థిక వ‌న‌రుగా.. క‌ల్ప‌వృక్షంగా మారింది. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఈ ప్రాంతం హైద‌రాబాద్‌కు ప‌రిమితం కావ‌డంతో వ‌న‌రులు మొత్తంగా తెలంగాణ‌కు ఉండిపోయిన‌ట్టు అయింది. ముఖ్యంగా ఏపీకి ఆర్థిక వ‌న‌రులు అందించే న‌గ‌రం లేకుండా పోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. కొత్త రాజ‌ధానిని ఏర్పాటు చేసుకునే వ‌ర‌కు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.


దీనిలో ప్ర‌ధానంగా 2024 వ‌ర‌కు హోదా ను కొన‌సాగించాల‌ని అనుకున్నారు. త‌ద్వారా.. సుదీర్ఘ తీర‌ప్రాంతం (3 వేల కిలో మీట ర్ల‌కు పైగా..) ఉన్న ఏపీ  అన్ని విధాలా అభివృద్ది చెందుతుంద‌ని అనుకున్నారు. అదేవిధంగా విద్యారంగంలోనూ ఏపీ ముందు న్న నేప‌థ్యంలో మ‌రింత‌గా పురోగ‌మిస్తుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. త‌ద్వారా.. హైద‌రాబాద్ రూపంలో కోల్పోయిన ఆదాయా న్ని సంపాయించుకునే అవ‌కాశం ఏపీకి ఏర్ప‌డుతుంద‌ని కూడా.. అప్ప‌ట్లో లెక్క‌లు వేసుకున్నారు. ఇది వాస్త‌వ‌మే.. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే పెట్టుబ‌డి దారుల‌కు కొద‌వ‌లేకుండా ఉంటుంది.


పైగా.. ఇత‌ర ప్రాంతాలకు సైతం ఉపాధిని అందించే ప‌రిస్థితి ఏపీకి వ‌స్తుంది. అందుకే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రమ‌నేది అంద‌రూ ఒప్పుకొనే ఏకైక మాట‌. కానీ, ఇక్క‌డే రాజ‌కీయ కార‌ణాలు ఉన్న నేప‌థ్యంలో దీనిని ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు అంగీక‌రించ‌డం లేదు. ప్ర‌ధానంగా రాష్ట్రాన్ని అస‌మ‌తుల్యంగా విభ‌జించారంటూ.. మోడీ ప‌దే ప‌దే కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిని స‌రిదిద్దేందుకు ఆయ‌న శ్ర‌ద్ధ చూప‌డం లేదు. కేవలం రాజ‌కీయంగానే వాడుకుంటున్నారు. మ‌రో కార‌ణం.. త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌.. వెనుక‌బ‌డి పోతుంద‌న్న ఆలోచన కూడా ఆయ‌న‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మైనా.. ఆర్థికంగా పుంజుకుంటుంద‌ని తెలిసినా.. హోదా ఇచ్చేందుకు మోడీ మాత్రం అంగీక‌రించ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: