ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన హామీలలో తల్లికి వందనం స్కీమ్ కూడా ఒకటి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక విద్యార్థికి మాత్రమే వైసీపీ 15,000 రూపాయలు ఇచ్చేది. ఆ 15,000 రూపాయలలో సైతం వేర్వేరు కారణాల వల్ల 2,000 రూపాయల వరకు వైసీపీ కోత విధించేది.
 
ఈ కారణాల వల్ల లబ్ధిదారులు ఈ స్కీమ్ అమలు విషయంలో మరీ అంత సంతృప్తిగా ఉండేవారు కాదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించడం జరిగింది. చంద్రబాబు ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో చదువుకునే ముగ్గురు పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి ఏకంగా 45,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
 
అయితే గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఈ స్కీమ్ కు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ స్కీమ్ కు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేసినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు ఏడాదికి 3 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ స్కీమ్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
 
ఈ విధంగా చేయడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను కొంతమేర తగ్గించినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అయితే ఈ స్కీమ్ ను మరీ ఆలస్యంగా అమలు చేయడం మాత్రం సరైన నిర్ణయం కాదు. జులై చివరి వారం లోపు మార్గదర్శకాలను విడుదల చేసి ఆగష్టులో ఈ స్కీమ్ ను అమలు చేస్తే మంచిది. గత ప్రభుత్వం జూన్ నెలలో ఈ స్కీమ్ ను అమలు చేసేది. చంద్రబాబు కూడా ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని ఫాలో అయితే మంచిది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: