ఏపీ మరికొన్ని రోజుల్లో 100కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానుండగా అన్న క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు, తినడానికి తిండి కూడా లేని వాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకు కాకుండా 10 రూపాయలకు అల్పాహారం, భోజనం అందిస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాలలో 10 రూపాయలు ఖర్చు చేయకపోతే టీ కూడా కొనే పరిస్థితి లేదు.
 
5 రూపాయలకు అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం మరీ పెరుగుతుందని 10 రూపాయలకు అందించినా ప్రజలపై ఆ భారం ఎక్కువగా పడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లలో తక్కువ ధరకే టిఫిన్, భోజనం అందించినా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. క్వాలిటీ విషయంలో తప్పులు జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
 
అందువల్ల క్వాలిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బాబు ఈ స్కీమ్ ను అమలు చేస్తే మంచిది. అదే సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఊరికి చివరన అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది ఎదురవుతోంది. బస్టాండ్ కు దగ్గర్లో, ఆస్పత్రులలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పవచ్చు.
 
ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర ఈ ఆహారం అందించడం ద్వారా రోగులు, రోగుల బంధువులు ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. కూటమి సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాల్సి ఉంది. అన్న క్యాంటీన్ల నిర్వహణ విషయంలో మంచి పేరును సొంతం చేసుకుంటే ఈ పథకమే కూటమికి శ్రీరామరక్ష అవుతుంది. ఈ స్కీమ్ అమలు విషయంలో బాబు నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఈ స్కీమ్ అమలు కోసం ఏపీ ప్రజలు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: