6 గ్యారంటీలు అనే నినాదంతో  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారు. మరి ముఖ్యంగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని రేవంత్ ఒక సంస్కరణను తీసుకువచ్చారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణమా ఇంతకంటే గొప్ప హామీ ఇంకేం ఉంటుంది అని అందరూ మురిసిపోయారు.


 దీంతో ముందు వెనక ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దేసి అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయగా.. ఇక ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు మాత్రం కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అంటే టికెట్ లేకుండా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇది మహిళలకు సౌకర్యవంతంగానే ఉన్న.. ఆర్టీసీ నష్టాల్లోకి వస్తే.. రానున్న రోజుల్లో ఆర్టిసి సర్వీసులు కూడా తగ్గే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే పురుషులకు టికెట్ రేట్లను అమాంతం పెంచేసింది ప్రభుత్వం. ఇలా ఆర్టీసీ ప్రయాణం  ఉచితం అంటూ చెబుతూనే మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నారు. మరోవైపు ఇక ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసినందుకు ప్రభుత్వం భారీ మొత్తంలోనే అటు ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తుంది. తద్వారా ఈ చెల్లించిన మొత్తాన్ని కూడా మళ్లీ పన్నుల రూపంలోనే అటు ప్రజల నుంచి వసూలు చేస్తారు. ఇంకోవైపు ఏకంగా ఇలా ఉచిత ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవు. దీంతో సామాన్య మహిళలు  మాత్రమే కాదు బాగా డబ్బు ఉన్న వాళ్ళు సైతం ఆర్టీసీ బస్సుల్లోనే ఉచితంగా ప్రయాణించేందుకు మొగ్గు చెబుతున్నారు. దీంతో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వంపై పడే భారం అంతకంతకు పెరుగుతుంది అన్నది ప్రస్తుతం మహిళలు గ్రహించారు.

 దీంతో ఈ పథకంతో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే బదులు చార్జీలను పెంచి ఉంటే బాగుండేదని ఎంతోమంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీకి భారీగా లాభం  వచ్చినప్పటికీ ఇక ఇలా పథకం కోసం ఆర్టీసీ సంస్థ కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఆ డబ్బులనే మళ్లీ ప్రజల నుంచి పనుల రూపంలో వసూళ్లు చేస్తుంటారు. దీంతో ప్రజలకు నష్టమే కలుగుతుంది. ఇంకోవైపు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కారణంగా ఏకంగా మెట్రో ట్రైన్ పరిస్థితి దీనంగా మారిపోయింది. ఎవరు కూడా మెట్రో ట్రైన్ లో ప్రయాణించని పరిస్థితి. ఇలా హైదరాబాద్ను అత్యాధునిక నగరంగా మార్చిన మెట్రో భవితవ్యం ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రమాదంలో పడిపోయింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ పథకంఫై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: