ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వాలంటీర్ల వ్యవస్థ త్రిశంకు స్వర్గంలో ఉంది. 10,000 రూపాయలు వేతనం వస్తుందని ఆశ పడిన వాలంటీర్లు ఇప్పుడు తమ ఉద్యోగం కొనసాగితే చాలని అనుకునే పరిస్థితి ఏర్పడింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెంచిన పింఛన్లను పంపిణీ చేయడంతో వాలంటీర్లకు కొత్త అనుమానాలు మొదలయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
అయితే వాలంటీర్లకు బాబు కచ్చితంగా 10,000 ఇస్తారని కానీ వాలంటీర్ల సంఖ్యను మాత్రం సగానికి సగం తగ్గిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 1,30,000 సచివాలయ ఉద్యోగులతోనే రాష్ట్రంలోనే పింఛన్ల పంపిణీ సవ్యంగా జరిగింది. ఎక్కువ సంఖ్యలో వాలంటీర్లను కొనసాగించడం వల్ల ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదనే సంగతి తెలిసిందే. అందువల్ల ఈ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయనుందని తెలుస్తోంది.
 
వాలంటీర్ల వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దు చేస్తే కొత్త సమస్యలు, కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దు చేస్తే మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.వాలంటీర్ల వ్యవస్థ విషయంలో నాన్చుడు ధోరణి మాత్రం కూటమి సర్కార్ కు మంచిది కాదు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లపై మాత్రం వేటు తప్పదని తెలుస్తోంది.
 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వాలంటీర్లకు ఎలాంటి సమస్య వచ్చేది కాదు కానీ 5,000 వేతనం కొనసాగేది. కూటమి తమ వేతనాలు పెంచుతుందని చాలామంది వాలంటీర్లు భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థలో కూటమి సర్కార్ కొన్ని మార్పులు చేసి ఆ ఉద్యోగులను వినియోగించుకుంటే మంచిదని చెప్పవచ్చు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ వల్ల కరోనా సమయంలో సైతం ఏపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడటంతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో సక్సెస్ అయింది. ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దు చేస్తే మాత్రం ఆ నిర్ణయం సరైన నిర్ణయం అనిపించుకోదు.


మరింత సమాచారం తెలుసుకోండి: