* వాలంటీర్ల ప్రాధాన్యత తగ్గించిన బాబు
* జగన్ చేసిన తప్పిదాలకు ఇవ్వకుండా స్కెచ్ లు
* ప్రజా ప్రతినిధులకు అత్యధిక ప్రాధాన్యత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత... సీఎం చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనను... మొదటి రోజు నుంచే చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే... ఇదిరా అన్నట్లుగా...  తెలుగు ప్రజలు గర్వపడేలా ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి  పరోక్షంగా కారణమైన వాలంటీర్లకు ఎసరు పెట్టి...  చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు.

 

సూపర్ సిక్స్ లో భాగంగా... జులై ఒకటో తేదీ నుంచి  పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు... నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. అటు ఎమ్మెల్యేలు.. మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలలో పెన్షన్ ప్రక్రియను... వారి చేతుల మీదుగానే  పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాలంటీర్లను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు.


వాలంటీర్లకు పెన్షన్ ప్రక్రియ అప్పగిస్తే... ప్రజా ప్రతినిధుల  ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని... సీఎం చంద్రబాబు నాయుడు ముందే గ్రహించారు. అయితే ఇది గ్రహించక జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వాలంటీర్ల ప్రాధాన్యత పెంచి... ప్రజా ప్రతినిధులను డమ్మీ చేశారు జగన్. దాని ఫలితంగా పదకొండు సీట్లే వైసిపికి వచ్చాయి. అయితే.. చంద్రబాబు నాయుడు అలా చేయకుండా... వాలంటీర్లను తొక్కేశారు.


ఫుల్ పవర్స్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు మాత్రమే ఇచ్చేశారు చంద్రబాబు. తద్వారా ప్రజలకు ఏ అవసరం కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుంది. మళ్లీ ఓటు అడగడానికి వెళ్లినా కూడా... ప్రజలు వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే వాలంటీర్ వ్యవస్థను... దాని ప్రాధాన్యతను తగ్గించే దిశ గా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తద్వారా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: