* తెలంగాణలో 10-15 జిల్లాల రద్దుకు స్కెచ్!
* జిల్లాల రద్దు రేవంత్ సీటుకే ఎసరు తప్పదా
* కేసీఆర్ మార్క్  తొలగించడం రేవంత్ తరం కాదా !


తెలంగాణ రాష్ట్రంలో... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంస్కరణ లు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా గులాబీ అధినేత, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకుండా... పథకాలకు, నెంబర్ ప్లేట్లకు, అలాగే జిల్లాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.  తెలంగాణ సింబల్ లో కూడా మార్పులు చేసేందుకు కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి... కెసిఆర్ అనే పేరు లేకుండా చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా.. మార్చేసి తన మార్కు పాలన చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాకతీయ కళా తోరణాన్ని కూడా ఎగర కొట్టేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు చార్మినార్ ముద్ర లేకుండానే... తెలంగాణ చిహ్నం ఉండేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా... తెలంగాణ రాష్ట్ర జిల్లాల  రద్దు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. అందులో..  దాదాపు 10 నుంచి 15 జిల్లాలను రద్దు చేసే దిశగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన ప్రజలకు త్వరగా అందాలనే నేపథ్యంలో కేసీఆర్ 33 జిల్లాలను చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. కెసిఆర్ మార్కును తొలగించాలని జిల్లాల రద్దుకు పోనుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లాల పేర్లు కూడా మార్చేస్తున్నారు రేవంత్. ఇప్పటికే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు ప్రకటన కూడా రిలీజ్ చేశారు.


6 గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి...  వాటిని పక్కకు పెట్టి  పేర్లు మార్చడం,  ఉద్యమ నాయకుడు కేసీఆర్ మార్కును  తొలగించడమే పనిగా పెట్టుకున్నారు. నిరుద్యోగులు రోడ్డు ఎక్కిన కూడా పట్టించుకోవడం లేదు. పెన్షన్లు కూడా సరిగా పడటం లేదు. పక్క రాష్ట్రంలో... పెంచిన పెన్షన్లు మొదటి నెల నుంచి ఇస్తే...  రేవంత్ రెడ్డి అధికారంలోకి ఏడు నెలలు కావస్తున్న ఆ పెన్షన్ మాత్రం  పెంచి ఇవ్వడం లేదు. దీంతో ఆరు నెలల్లోనే రేవంత్ రెడ్డి... ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: