2024 ఎన్నికలలో కూటమి ఫ్యాన్ ని తట్టుకొని నిలబడ్డ వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజవర్గానికి కనీసం గెస్ట్లుగా కూడా రావడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఫలితాలు వెలబడిన తర్వాత అలా వచ్చి ఇలా మాయమైపోతున్నారు.. పనుల కోసం సొంత పార్టీ వాళ్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తున్నది.ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి..


ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ కేవలం రెండు ప్రాంతాలలో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి మంత్రాలయం కాగా మరొకటి ఆలూరు.. అయితే మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్న బాల నాగిరెడ్డి అక్కడ ప్రజలు దర్శనం చేసుకోవడానికి కరువైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2009లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి వైసిపి పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో చేరారు అయితే ఆ తర్వాత అనర్హత వేటుపడడంతో.. 2014, 19, 2024లో వరుసగా వైసీపీ తరఫునుంచి గెలిచారు..


కానీ టిడిపి గాలిలో కూడా గెలిచిన ఈ ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ గాని ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో చర్చనీయంగా మారింది. ఫలితాల తర్వాత కొద్ది రోజులు మాత్రమే స్థానికంగా ఉన్న బాలనాగిరెడ్డి ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళిపోయినట్లు సమాచారం. ఫలితాలు వచ్చి ఇప్పటికి నెల రోజులు అవుతున్న నియోజకవర్గంలో కనీసం ఎలాంటి మీటింగులు పెట్టలేదని ఇలాంటి విషయాలు మాట్లాడకపోవడంతో కచ్చితంగా పార్టీ మారతారని విషయం వైరల్ గా మారుతున్నది. ఎన్నికల్లో ఎంతో కష్టపడి గెలిపిస్తే తమ గురించి పట్టించుకోలేదని అపోహ ఇప్పుడు క్యాడర్లో పెరిగిపోతోందని.. రాష్ట్ర ప్రభుత్వం మారిన పరిస్థితులలో స్థానిక పార్టీ క్యాడర్ కూడా భరోసా కల్పించలేకపోవడంతో ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయాడని ప్రశ్న ఇప్పుడు అక్కడ  ప్రజలలో ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: