కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వైసిపి కార్యకర్తలు వైసిపి భవనాలు , వైసిపి నేతలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ కార్యాలయాలను కూల్చివేయడం పైన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం మాత్రం అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తామంటూ హెచ్చరించింది. ఆ మాటలను పట్టించుకోకుండా తాజాగా టిడిపి ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం మరింత ఉద్రికతకు దారి తీసేలా కనిపిస్తోంది. జాతీయ రహదారి పైన చేసినటువంటి రచ్చతో పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన నానా హంగామా చేశారు.


ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కంభంపాడు లో ఉన్నటువంటి వైపాక చెందిన ఎంపీపీ కాలసాని చెన్నారావు భవనాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తమ స్థలాలను ఆక్రమించి అందులో భవంతి కడుతున్నారని కుంభపాడుకు చెందిన కొంతమంది ముస్లిం మహిళలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అయితే అది అక్రమంగా నిర్మించాలనుకున్న ఆయన వాటిని తొలగించే బాధ్యతలను కూడా తీసుకొని ఆ స్థలాన్ని వారికి అప్పగించాలనే విధంగా ఆదేశాలను తీసుకున్నారు.

అధికారులు తొలగించకపోతే తానే తొలగిస్తామంటూ ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టడంతో నానా హంగామా మొదలయ్యింది. నిన్నటి రోజున ఉదయమే టిడిపి జనసేన కార్యకర్తలతో పాటు బుల్డోజర్ తో భవనం వద్దకు చేరుకొని కూల్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైపాక ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది దీంతో ఇరువురి నేతలు రోడ్డు మీద ఉండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి మరి నానా హంగామా చేశారు..ఇలాంటి కూల్చివేత చర్యల పైన మైలవరం ఏసీబీ మురళీమోహన్ అడ్డుకున్నప్పటికీ సర్వే చేసి అక్రమాలు ఉంటే తొలగించాలని అధికారులు చెప్పిన ఎమ్మెల్యే మొండిగా వీటిని కూల్చేయాలని చూస్తున్నారనీ  తెలిపారు.. ప్రస్తుతం కూల్చివేతను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.. అయితే టిడిపి నేతలు చేస్తున్న పనుల వల్ల రోజురోజుకీ  ప్రజలలో కూడా అసహనానికి గురవుతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి విషయాల పైన అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: