టాలీవుడ్ లో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదకు రావటం చాలా అరుదు. వీరిద్దరూ కలిసి చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే వేదిక పంచుకున్నారు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ముగ్గురు కలిసి ప్రత్యేకంగా సమావేశం అయితే ఎలా ? ఉంటుంది. ఈ ముగ్గురు హీరోల అభిమానుల ఆనందానికి అవుధులే ఉండవు అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య ఒకప్పుడు వివాదాలు ఉండేవి. అయితే ఇప్పుడు అవన్నీ సమసిపోయాయి.


ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్ది దించేందుకు మెగా అభిమానులు, నందమూరి అభిమానులు.. కమ్మలు, కాపులు.. పవన్ కళ్యాణ్ అభిమానులు, బాలయ్య అభిమానులు, చిరంజీవి అభిమానులు ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ లో అందరు హీరోల అభిమానులు కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేశారు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నిర్మాత‌లు హైదరాబాద్‌ నుంచి వచ్చి.. అమరావతిలో పవన్ కళ్యాణ్ ను కలిసి సినిమా రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసి వెళ్లారు.


అయితే ఎవరు అవునన్నా.. కాదన్నా.. టాలీవుడ్ పెద్దగా చిరంజీవి కొనసాగుతున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిరంజీవి అయిష్టంగానే టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఇప్పుడు తమ్ముడు.. స్వయానా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరంజీవి నేరుగా పవన్‌తో భేటీ కావచ్చు. అయితే ఇదే భేటీలోకి బాలయ్యను కూడా ఇన్వాల్వ్ చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు కలిసి త్వరలోనే అమరావతిలో సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగ అభివృద్ధితో పాటు.. టికెట్ రేట్ల పెంపు, ఇతర విషయాలు అన్ని కలిసికట్టుగా చర్చించి ఇండస్ట్రీకి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: