జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019 నుంచి 2023 వరకు ఏకధాటిగా పాలించారు. మరోసారి కూడా ఆయనే గెలుస్తారని ఎన్నో ఆశలు పడ్డారు. అసలు గెలిచేశాను అనుకున్నాడు కూడా. కానీ ఆయన ఆశలన్ని అడియాశలు అయ్యాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అలాంటి జగన్ అంతగా ఓటమికి కారణం ఏంటనేది ఇప్పటికి కూడా సమీక్ష చేస్తూనే ఉన్నాడు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు  రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భవనాలు కట్టించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రుషికొండ ప్యాలెస్. ఇది జగన్ కలల భవనం అని చెప్పవచ్చు. దీన్ని నిర్మించడం కోసం 600 కోట్లకు పైగా ఖర్చు చేశారట. అయితే మరోసారి గెలిస్తే ఈ ప్యాలెస్ నుంచే పాలన అందిద్దామని ఆయన ఆశపడ్డారట.

 కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో  ఆయన కల నెరవేరలేదు. అయితే ఈ ప్యాలెస్ గురించి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ఎవరికీ తెలియదు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటబెట్టుకొని బయటి లోకానికి ఈ ప్యాలెస్ చూపించారు. దీంతో టిడిపి వాళ్లంతా జగన్ ప్రజాధనంతోనే ఈ భవనం కట్టుకున్నారని ఆరోపణలు చేసిన తరుణంలో వైసిపి వాళ్ళు రివర్స్ కౌంటర్ వేశారు. అది ప్రభుత్వ భవనం కోసమే కట్టామని చెబుతూ వచ్చారు.  దీంతో రుషికొండ ప్యాలెస్  గురించి మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే టిడిపి ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను   ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని అనుకుంటుందట.

ముఖ్యంగా రాష్ట్రానికి ఎవరైనా వివిఐపీలు వస్తే  దీన్ని అతిథి గృహంగా వాడుకోవాలని భావిస్తున్నారట. అంతేకాదు ఈ ప్యాలెస్ పై మంత్రి నారా లోకేష్ కన్ను కూడా పడిందని టాక్. అయితే దీన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలని చూస్తున్నారట. దీన్ని తన క్యాంప్ ఆఫీసుగా మార్చుకుంటే  విశాఖ జిల్లాలో ప్రజలకు ఎక్కువ సేవలు అందించవచ్చు అని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే లోకేష్ మరియు సీఎం చంద్రబాబు వచ్చి ఈ రుషికొండ ప్యాలెస్ ని చూడబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: