ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో మెగా తొలి సంతకం పెడతానని చంద్రబాబు మాట ఇచ్చారు అన్నట్లుగానే ఆయన సాయం చేశారు. ఆ తర్వాత డీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్‌ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనిని పారదర్శకంగా కండక్ట్ చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ నొక్కి చెప్పారు. 

టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై ఉన్నతాధికారులతో ఓ సమీక్ష కూడా చేపట్టారు. టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ఇతర అంశాలపైనా చర్చించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య టైమ్ గ్యాప్ ఎక్కువగా ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దాని గురించి కూడా లోకేష్ సలహాలు ఇచ్చారు. డీఎస్సీ ఎప్పుడు పెట్టాలని దానిపై ఒక మంచి అభిప్రాయానికి రావాలంటే అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలియజేశారు. 

మరోవైపు టెట్ సిలబస్‌లో మార్పు చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. 2024, ఫిబ్రవరిలో ఏ సిలబస్ తో టెట్ ఎగ్జామ్ జరిగిందో అదే సిలబస్‌తో జులై ఎగ్జామ్‌ జరుగుతుందని అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. 

 ఈ విషయంలో ఇంకా డౌట్స్ ఉంటే సిలబస్ వివరాలను https://aptet.apcfss.in లో చెక్ చేసుకోవచ్చు.

మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు పలు డిపార్ట్‌మెంట్స్‌లో పోస్టులు చాలా తక్కువగా వేశారని అభ్యర్థులు వాపోయారు. ఇదే విషయాన్ని లోకేశ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారని... ఫలితంగా పోస్టులు తగ్గాయని వారు బదులిచ్చారు. 

అయితే అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో త్వరగా న్యాయపరమైన వివాదాలను పరిష్కరించాలని, తద్వారా ఎక్కువ పోస్టుల భర్తీ చేయాలని లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే పాఠశాలలను మూసివేయాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వులను సమీక్షించారు. ఆర్డర్ 117కి సంభవించిన ఏదైనా నష్టంపై పూర్తి నివేదిక అవసరం. మెగా డీఎస్సీకి వయోపరిమితి సడలింపు ఆవశ్యకతను అధికారులు మంత్రికి తెలియజేయనున్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫీజులు మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: