ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల కీలక సూచనలు చేశారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి గా పని చేసిన అనుభవంత.... ఏపీ సీఎం చంద్రబాబుకు పలు సూచనలు ఇచ్చారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల లేఖ కూడా రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంకు సంబంధించిన ఆర్ధిక పరిస్థితి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు యనమల.


మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు.. చేపట్టాల్సిన చర్యలపై సంచలన సూచనలు చేశారు యనమల. అవినీతిపరుల దిగమింగిన సోమ్మను తిరిగి రాబట్టేలా ప్రత్యేక చట్టం చేయాలని లేఖలో ప్రస్తావించారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల. ఇప్పటికే వివిధ శాఖల్లో అవినీతిని వెలికి తీసి కేసులు పెట్టేందుకు సిద్దమవుతోంది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి తగ్గట్టుగానే.. ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల లేఖ రాశారు.  గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరుగుతున్న సందర్భంలో సంచలనం అవుతోన్న యనమల సూచనలు చేయడం జరిగింది.


వైసీపీ నేతలు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టo అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని ఈ లేఖలో కోరారు. మాజీ ఆర్థిక మంత్రిగా నా అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నానని కూడా చెప్పారు. అందులో పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించాలని... పేర్కొన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల.... కేంద్రం నుంచి ఎక్కువ డెవల్యూషన్ వచ్చేలా చూడాలన్నారు.


సహేతుకమైన స్థిరమైన రుణాలు తీసుకోవాలని కోరిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల... ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్రాన్ని కోరాలని తెలిపారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని స్పష్టం చేశారు యనమల. సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని వివరించారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల.

మరింత సమాచారం తెలుసుకోండి: