ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా బిజీ బిజీ అనే చెప్పాలి. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిస్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ మూడో రోజు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు.తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకు ముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు.అంతే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్‌ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనాయకులు కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. అతరువాత ఇవాళ సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడకు ప్రయాణం కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: