రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కానీ ఇప్పుడు ఈ విమర్శలు అనేవి ఎక్కడా కనిపించడం లేదు అన్నీ బూతులే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మాటలు శృతిమించకుండానే విమర్శలు చేసేవారు కానీ ఇప్పుడు బాహటంగానే బూతు పురాణం విప్పుతున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు శృతి తప్పి వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు కోకొల్లలు. గౌరవనీయులైన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా అప్పట్లో వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డారు. బాబు ఫ్యామిలీ పై కూడా నీచంగా మాట్లాడారు. దీనివల్ల సీబీఎన్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయారు.

 వైసిపి నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు పైకి చెప్పలేనివి, జర్నలిస్టులు రాయలేని భాషల్లో ఉన్నాయంటే ఆ బూతులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఇలా ఉంటే మరి కొందరు మాత్రం హుందాగానే ప్రవర్తించారు. ఒక మంచి సబ్జెక్టు నేర్చుకొని ఆ అంశాలలో చంద్రబాబును విమర్శించారు గానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. అయితే ఇలాంటి వారికి వైసీపీ సీట్లు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఉదాహరణకు కొలుసు పార్థసారధి. 2024 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఇస్తుందని ఆయన ఎంతో ఆశపడ్డారు కానీ నిరాశ ఎదురయ్యింది దాంతో ప్రత్యర్థులపై బూతులు మాట్లాడనందుకే తనకు సీటు ఇవ్వకూడదని అధిష్టానం భావించి ఉండొచ్చు అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. 

 ఆ తర్వాత సైకిల్ గుర్తు పార్టీ లోకి వెళ్లిపోయారు. అక్కడ ఎమ్మెల్యే టికెట్ పొంది చివరికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. పార్థసారధి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును విమర్శించారు అయినా సరే చంద్రబాబు ఆయనకి సీటు ఇచ్చారు ఆయన చేసిన విమర్శలను విమర్శలుగానే చూశారు తప్ప కక్ష సాధించలేదు.

 ప్రజారాజ్యం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు మారిన సీనియర్ పొలిటీషియన్ సీ. రామచంద్రయ్య విషయంలోనూ చంద్రబాబు హుందాగా ఆలోచించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాలో ఆయన పేరును బాబు చేర్చినట్లుగా తెలుస్తోంది. రామచంద్రయ్య గత రాజకీయ చరిత్రను ఆయన పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా మంచోడా కాదా అని చూసి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. రామచంద్రయ్య కూడా చంద్రబాబును విమర్శించిన వారిలో ఒకరు. ఆయన వాటిని పట్టించుకోలేదు ఒక ప్రొఫెషనల్ పొలిటిషన్ గానే ఆలోచించారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే ఇలాంటి మైండ్ సెట్ అవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఆటిట్యూడ్ తోనే నాలుగుసార్లు ఏపీ సీఎం అవ్వగలిగారని పేర్కొంటున్నారు. జగన్ మాత్రమే ఈ విషయంలో వెనక బడే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: