* ఇచ్చిన హామీలని వేగంగా అమలు చేస్తున్న చంద్రబాబు!
* ప్రజలకు మేలు చేసే అంశాలపై పూర్తి దృష్టి!
* నెల రోజుల్లోనే కొన్ని హామీలని నెరవేర్చిన చంద్రబాబు!

( అమరావతి - ఇండియా హెరాల్డ్): ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంచి ప్రజాదరణ పొందుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చెయ్యడానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో పాటు.. ప్రజలకు మేలు చేసే ఎన్నో అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ..మంచి పాలన అందించే దిశగా వేగంగా దూసుకువెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఎన్నికలలో ఇచ్చిన అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీలైనన్ని హామీలు నేరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎంతో హుషారుగా ఉత్సాహంగా తన పనిని మొదలు పెట్టారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్యలు పై దృష్టి పెట్టారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు కీలకమైన హామీలపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. యువత నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలుల్లోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుకని అందించాలని నిర్ణయించారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం అందుబాటులో ఉండేది. అయితే జగన్ వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. దాని ఫలితంగా భవన నిర్మాణ రంగం చాలా దారుణంగా నష్టపోయింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు భావించి చాలా వేగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.భవన నిర్మాణ పనులు దొరక్క కూలీలు ఇబ్బందులు పడ్డారని గ్రహించి తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని రోడ్ల మరమ్మత్తులపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజా సమస్యలు వినడంతో పాటు వినతులు స్వీకరించాల్సిన నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.ప్రజా వేదిక పేరుతో ఇప్పటికే రెండు శనివారాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు చంద్రబాబు.ఇలా 2014 కంటే వేగంగా మారి నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: