ఏపీలో కూటమి అధికారం చేపట్టాక చంద్రబాబు అలాగే మంత్రులు, ఎమ్మెలు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్నారు. అందరి ఎమ్మెల్యే లలో కొంచం డిఫరెంట్గా కనబడుతున్న ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష. డానికి కారణం ఆమె సింప్లిసిటీనే అంటున్నారు అక్కడి ప్రజానీకం.నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.ఆమె అయిదు నెలల క్రితం ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త. భర్త టీడీపీలో చురుకుగా ఉంటున్నాడన్న కారణం చేత ఆమెను అన్నివిధాలుగా ఇబ్బందులు పెట్టారు. అనేక ఫిర్యాదులు చేసి ఆమెను ఏదోలా ఉద్యోగం నుంచి తీయించాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు విసుగొచ్చి శిరీషాదేవినే రాజీనామా చేశారు. తన ఉద్యోగాన్ని వదులుకుని భర్తతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగిన ఆమె  తన వాక్పటిమతో నాయకత్వం వహించి ప్రజలందరిని ఆకర్షించేలా చేశారు. ఈ క్రమంలోనే శిరీషాదేవి టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడడంతో ఆమెకు కూటమి నుంచి రంపచోడవరం టీడీపీ అభ్యర్ధిగా అదృష్టం వరించింది. అసాధ్యమనుకున్న విజయాన్ని సాధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యర్ధి , సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్లు మెజార్టీతో గెలుపొంది 27ఏళ్ల అతిచిన్న వయస్సులో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు శిరీషా దేవి.

ప్రస్తుతం ఆమె సింప్లిసిటీ కు మారుపేరుగా నిలిచారు శిరీష. ఐతే మిగితా ఎమ్మెల్యే లుకూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని తెలుస్తుంది.ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే ఐనా పాత వృత్తి అంగన్వాడీను వదలలేదు.ఆమె అప్పుడప్పుడు అంగన్వాడీకి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పడం మరువలేదు. అలాగే వారు పడే కష్టాలు తనకు తెలుసనీ వాటిని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని ఆమె హామీ ఇచ్చారు.ఆమె నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ అంగన్వాడీలు పడే కష్టం తనకు బాగా తెలుసనీ వాటి నుండి వారందరిని ఆదుకోవడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు.ఆమె అంగన్వాడీకి వెళ్ళడానికి ప్రభుత్వం కాన్వాయ్ వాడకుండా తాను ఇంతకు ముందు ఆటోలో వెళ్లేదానినని ఇపుడు కూడా ఆటోలోనే వెళ్తున్నానని చెప్పడం విశేషం. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మూలాలు మర్చిపోకూడదు అనేది ఆమె నమ్మకం అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: