జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తనకు దక్కిన అధికారాన్ని బాధ్యతగా ఫీలవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చొరవతో యువతి మిస్సింగ్ మిస్టరీ వీడిందని సమాచారం అందుతోంది. భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు సుఖాంతం చేయడం గమనార్హం. ఈ కేసులో నిందితుడైన అంజాద్ కటకటాల పాలయ్యాడు.
 
మరోవైపు పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. సైలెంట్ వ్యూహాలతోనే ఏపీ అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ల దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.
 
పవన్ ను నమ్మి వెళ్తే న్యాయం పక్కా అనే అభిప్రాయం ప్రజల్లో సైతం ఉంది. పవన్ అర్జీ తీసుకుని సమస్యను వేగంగా పరిష్కరించాలని భావిస్తే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నాయకుడు ఇంత వేగంగా స్పందించిన సందర్భాలు అయితే లేవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ రియల్ లైఫ్ హీరోగా ఉంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.
 
సినిమాలకు సైతం తాను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనని పవన్ తాజాగా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సైతం సంచలనాలను సృష్టిస్తూ సత్తా చాటుతున్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే పవన్ కచ్చితంగా తమను గెలిపిస్తాడనే నమ్మకం భవిష్యత్తులో జనసేన నుంచి టికెట్ ఆశించే వారిలో ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రధాన రాజకీయ పార్టీగా నిలబెట్టడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పవన్ కెరీర్ పరంగా సరైన దారిలోనే అడుగులు వేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: