రాజకీయ నాయకుడిగా చంద్రబాబుకు 40 సంవత్సరాల అనుభవం ఉండగా ఆ అనుభవంతో చంద్రబాబు పాలిస్తూ తన పాలనతో బాబు మెప్పిస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి సరిగ్గా నెలరోజులు కాగా ఈ నెల రోజుల్లో బాబు తీసుకున్న ప్రతి నిర్ణయం ఆహా అనేలా ఉంది. వృద్ధులు, యువతకు మేలు చేకూరేలా బాబు తీసుకున్న నిర్ణయాలపై ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
పోలవరం, అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టిన బాబు అభివృద్ధిలో అదుర్స్ అనిపిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాల అమలులో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ సంక్షేమంలో సూపర్ అనిపించుకుంటున్నారు. అనుభవంతో ఆహా అనిపిస్తున్న బాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. బాబు బాధ్యతగా పాలనను సాగిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు.
 
చంద్రబాబు నాయుడు వాలంటీర్ల విషయంలో సైతం తెలివిగా అడుగులు వేస్తున్నారని 1,30,000 మంది వాలంటీర్లతోనే పథకాల అమలు జరిగేలా నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోలో కొత్తదనం చూపించి పార్టీని అధికారంలోకి తెచ్చిన బాబు అప్పులు చేస్తున్నాడని కొంతమేర విమర్శలు వినిపిస్తున్నా ప్రజల్లో మాత్రం పాజిటివ్ ఒపీనియన్ కలిగించడంలో సక్సెస్ అవుతున్నారు.
 
చంద్రబాబు నాయుడు పాలన చూసి వైసీపీ నేతలు సైతం ఔరా అంటున్నారు. సంక్షేమంలో చంద్రబాబు జగన్ ను మించిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ నుంచి బాబు పాలన గురించి రియాక్ట్ అయ్యే వాళ్లు సైతం ఎక్కువగా లేకపోవడం కూటమికి ప్లస్ అవుతోంది. రాబోయే ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిని ఇతర రాష్ట్రాల రాజధానులకు ధీటుగా అభివృద్ధి చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబులో వచ్చిన మార్పు ఏపీ ప్రజల మంచికే అని చెప్పవచ్చు. చంద్రబాబు సంక్షేమ పథకాలను నిదానంగా అమలు చేసినా సమస్య లేదని వేగంగా రాష్ట్రం అభివృద్ధి చేస్తే చాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాబు, పవన్ కలిసి పని చేస్తే ఏపీలో ఎప్పటికీ కూటమికి తిరుగుండదని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: