కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత అమరావతి పైన సీఎం చంద్రబాబు ఒక శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేత పత్రం పైన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా స్పందించడం జరిగింది.. ముఖ్యంగా అమరావతి పైన చంద్రబాబు స్వేత పత్రం కాదని అది పచ్చపత్రం అంటూ ఏకంగా విమర్శించడం జరిగింది. జగన్ పాలనపైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని అమరావతి స్మార్ట్ సిటీ కోర్ క్యాపిటల్ అభివృద్ధి వంటివి తమ పాలనలోనే జరిగాయి అంటూ ఆదిమూలకు సురేష్ తెలియజేశారు..


వీటన్నిటితో పాటు చంద్రబాబు చేసినటువంటి అప్పులను కూడా తాము తీర్చమంటూ ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది.. అసలు చంద్రబాబు అమరావతి కోసం ఖర్చు చేసింది ఎంత? అప్పులు చేసింది ఎంత ?అనే వివరాలు కూడా ఈ శ్వేత పత్రంలో విడుదల చేయాలంటూ తెలిపారు.. సంపద సృష్టిస్తానని పదేపదే చెప్పిన బాబు.. ఆ సంపద ఎవరికోసం సృష్టిస్తారో తమ వారికే సంపద సృష్టిస్తారో ..ప్రజలకు సృష్టిస్తారా లేదా చెప్పాలి అంటూ తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీలకు కూడా వైసీపీ ప్రభుత్వం పింఛన్ పెంచి ఇచ్చింది అంటూ తెలిపారు.


9 సిటీ ల పేరుతో లక్షల కోట్లు నిర్మిస్తామంటూ చెప్పడం వల్లే మేము వ్యతిరేకించాము అన్ని లక్షలు ఒకే చోటు ఖర్చుపెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అనేది తమకు ప్రశ్నార్థకంగా మారింది అంటూ తెలిపారు. మరి రాజధాని కడుతున్న చంద్రబాబు రైతులకు ఎందుకు రిటర్నబుల్ ప్లాటులను ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు? రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో ఒక పెద్ద కుంభకోణమే జరిగిందంటూ ఆయన ఆరోపించారు. 2014 జూన్ నుండి డిసెంబర్ వరకు వేలాది ఎకరాలు చాలా చేతులు మారాయని అది ఎలా జరిగిందో ప్రజలకు తెలపాలని ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. అమరావతిలో రోడ్లు మీద వెలుగుతున్న లైట్లు కూడా తమ హయాంలో వేసినవే అంటూ తెలిపారు. రాజధానిలో 14 వేల ఎకరాలకు 52,000 మందికి పట్టాలు కూడా ఇచ్చామంటూ తెలిపారు. చంద్రబాబు చూపించేవన్ని గ్రాఫిక్స్ అయితే జగన్ వాటిని వాస్తవ రూపంలో నిర్మించారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: