* సినిమాలకు దూరంగా పవన్
*2029 లక్ష్యంగా పవన్ దూకుడు
* చంద్రబాబుతో మంచి స్నేహం
* జనసేనను మరింత బలోపేతం చేయడం  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొన్న అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 100కు 100% స్ట్రైక్ రేట్ తో.. జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా రెండు ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అటు పిఠాపురం నియోజకవర్గంలో... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 అక్కడితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...మంత్రిగా కూడా...డ్యూటీ ఎక్కారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ తన మార్కు పాలన చూపిస్తున్నారు. అంతేకాకుండా... ఒక రూపాయి జీతం  తీసుకోకుండా ఎమ్మెల్యేగా పని చేస్తానని... మంత్రిగా దూసుకు వెళ్తానని  ప్రకటించారు పవన్ కళ్యాణ్.

 వైసీపీ నేతలు చాలామంది పవన్ కళ్యాణ్ పై చాలా రకాల విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటిషన్ కాదని... కొన్ని రోజులు సినిమాలు ఆ తర్వాత రాజకీయాలు అంటూ... తిరుగుతాడని వైసీపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు. అయితే తాజాగా... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలపై కూడా కీలక ప్రకటన చేశారు. తాను సినిమాలు ఇకపై చేయడం కష్టమని తెలిపారు.

 నేను OG సినిమా అంటే ప్రజలు క్యాజి అంటారని...  పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి... ఇక సినిమాలలోకి వెళ్లకుండా ఫుల్ టైం పొలిటిషన్ గా మారబోతు న్నారని అర్థమ వుతోంది. జనసేన పార్టీ ని సొంతంగా అధికారంలోకి తీసుకువచ్చేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు... తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాత... ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవుతేనే బాగుంటుందని చాలామంది కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: