* యంగ్, కొత్త వారికి బాబు ప్రాధాన్యత
*కేబినెట్ లోను కొత్త మొఖాలు
*మిత్ర పక్షాలతో బాబు సఖ్యత
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..చంద్రబాబు నాయుడు... సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత...సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... టిడిపిలో సీనియర్ లీడర్లను పక్కకు పెట్టి... యంగ్ లీడర్ కు అవకాశాలు ఇస్తున్నారు.టికెట్లు కూడా.. యంగ్ లీడర్లకు మాత్రమే ఇచ్చారు చంద్రబాబు.

 

యనమల లాంటి సీనియర్లకు  ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా యంగ్ స్టార్ లకు ఇచ్చారు చంద్రబాబు. ఇక కేబినెట్ పదవుల్లో కూడా... గోరంట్ల బుచ్చయ్య, అయ్యన్నపాత్రుడు, గంట శ్రీనివాస్  లాంటి సీనియర్ టిడిపి నాయకులకు.. అవకాశం ఇవ్వలేదు. మహిళా కోటలో పరిటాల సునీతకు కూడా  ఛాన్స్ ఇవ్వలేదు. కానీ... గొట్టిపాటి రవి, పయ్యావుల కేశవ్, రాంప్రసాద్ రెడ్డి, అనిత, లాంటి డైనమిక్ లీడర్లకు.. మంత్రి పదవి ఇచ్చి తన మార్కు పాలనను నిరూపించుకున్నారు చంద్రబాబు.

 ఇటు అనిత లాంటి మహిళ నేతకు హోం శాఖ మంత్రి పదవి ఇచ్చి... సంచలనమే సృష్టించారు. అంతేకాకుండా...  సీనియర్లలో అచ్చం నాయుడు  ఒకరు. ఆయనకు వ్యవసాయంపై మంచిపట్టు ఉంది. అందుకే... అచ్చం నాయుడుకు వ్యవసాయ శాఖ తో పాటు మరికొన్ని కీలక శాఖలు అప్పగించారు. పయ్యావుల కేశవ్... లెక్కల్లో అదరగొడతారు. కాబట్టి ఆయనకు ఆర్థిక శాఖ అందింది.

 ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అయ్యన్నపాత్రుడు కి... స్పీకర్ పదవి ఇచ్చి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. తమ్మినేని కంటే... ఎక్కువగానే రివర్స్ అటాక్ చేసే సత్తా గల నాయకుడు అయ్యన్నపాత్రుడు. దీంతో అసెంబ్లీలో వైసిపి నేతలు మాట కూడా ఎత్తే ప్రసక్తే లేదు. అటు మిత్రపక్షాలు అయిన జనసేన కు మూడు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చి..  సరికొత్త అంశానికి తెరలేపారు బాబు. అంతేకాకుండా   బిజెపికి ఒకే ఒక్క  మంత్రి పదవి ఇచ్చి గమ్మున కూర్చునేలా చేశారు. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్నారు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: