ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులే అవుతున్నా రాష్ట్రంలో పాలనలో బాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పాలన అందిస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా చెబుతున్నారు. రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నామని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
మరోవైపు వాలంటీర్ల సహాయం లేకుండానే ఇంటింటికీ పింఛన్ అందించడంలో కూటమి సర్కార్ సఫలమైంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికివూడి శ్రీనివాస్ తాజాగా వైసీసీ ఎంపీపీ ఇంటిని కూల్చడానికి ప్రయత్నించగా ఈ ఘటన దుమారం రేపిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కొన్నిరోజుల క్రితం ఒక మంత్రి భార్య ప్రవర్తించిన తీరుపై బాబు సీరియస్ అయ్యారు.
 
ఇలా విమర్శలకు తావు లేకుండా పాలన సాగించడంపై బాబు ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏపీ 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చెడ్డ పేరు తెచ్చేవాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
 
మరోవైపు అమరావతిని బంగారం చేస్తానని చంద్రబాబు ఏపీ ప్రజలకు మాట ఇస్తున్నారు. రాజధాని నిర్మాణం కొనసాగించి ఉంటే ప్రభుత్వం దగ్గర 1,60,000 కోట్ల సంపద ఉండేదని చంద్రబాబు తెలిపారు. రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను పునరుద్ధరిస్తామని బాబు పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజల్లో రాజధాని వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని కలిగించాయని చెప్పవచ్చు. చంద్రబాబు ఏపీకి బెస్ట్ సీఎం, పర్ఫెక్ట్ సీఎం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మార్క్ పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురంలో స్థలం కొనుగోలు చేయడంతో ఆయన ఇకపై పిఠాపురంకే పరిమితం కానున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: