2014 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే . ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది . హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉండడం తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా అయ్యింది. ఇక 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది . ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దానితో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ప్రదేశాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు.

అందులో భాగంగా ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న ఐదు సంవత్సరాలు అక్కడ అనేక కట్టడాలను కూడా కట్టించారు. ఇక 2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అమరావతిని పెద్దగా పట్టించుకోకుండా మూడు రాజధానుల ప్రస్తావని తెరపైకి తెచ్చాడు. దీనితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక 2024 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ తెలుగు దేశం పార్టీ భారీ మొత్తంలో మెజారిటీ తెచ్చుకొని రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది. దీనితో మళ్లీ చంద్రబాబు అమరావతి పై శ్రద్ధ చూపిస్తూ వస్తున్నాడు.

తాజాగా చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడుతూ ... ఏపీ రాజధాని అమరావతి పై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఈమేజ్ ను సర్వ నాశనం చేసింది అని మండిపడ్డారు. విభజన జరిగి పది సంవత్సరాలు అయిన రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినీ గొప్ప రాజధాని గా మారుస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప రాజధానిగా అమరావతి తీర్చిదిద్దుతాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: