- బోధ‌న‌లో మ‌ళ్లీ పాత ప‌ద్ధ‌తుల‌కే బాబు ప‌ట్టం
- బాబు పాల‌న‌లో తెలుగు భాష‌కు మ‌హ‌ర్ద‌శేనా ?
- జ‌గ‌న్ స‌ర్కార్ తీరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల ర్యాంకులు ఢ‌మాల్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

చంద్ర‌బాబు స‌ర్కారు ఏపీలో సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట  వేస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని.. వారి అభిప్రా యాలు, అభిరుచుల‌కు అనుగుణంగా చంద్ర‌బాబు పాల‌న‌లో ప్రాధాన్యం పెంచ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అనేక విష‌యాల‌ను స‌మూలంగా మార్పు చేయాల‌ని నిర్ణ‌యించారు. గత జ‌గ‌న్ హ‌యాంలో తెలుగు భాష‌కు ఉన్న ప్రాధాన్యాన్ని త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు ఒక‌ప్పుడు విరాజిల్లింది.ఎంతో మంది తెలుగు మీడియంలోనే చ‌దువుకున్నారు.


అనేక మంది ఉన్న స్థాయి ఉద్యోగాలు, ప‌ద‌వులు కూడా ద‌క్కించుకున్నారు. అయితే.. మారుతున్న కాలాని కి అనుగుణంగా అంటూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియానికి పెద్ద‌పీట వేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలుగు మాధ్య‌మాన్ని ప‌క్క‌న పెట్టి.. పిల్ల‌లు అంద‌రికీ ఇంగ్లీష్ మీడియాన్ని బోధించాల‌న్న ష‌ర‌తు విధించారు. దీనిపై న్యాయ పోరాటాలు కూడా జ‌రిగాయి. అనేక మంది మేధావులు కూడా వ్య‌తిరే కించారు. అయిన‌ప్ప‌టికీ..జ‌గ‌న్ వెనక్కి త‌గ్గ‌కుండా.. అమ‌లు చేశారు.


ఫ‌లితంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల ర్యాంకులు ప‌డిపోయాయ‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రోవైపు.. ప్రైవేటు పాఠ‌శాల‌ల ఆద‌ర‌ణ ఏమైనా త‌గ్గిందా? అంటే అది కూడా లేదు. ఎలా చూసుకున్నా.. ఇంగ్లీషు మీడియం చ‌దువుల వ‌ల్ల బైజూస్ వంటిప్రైవేటు సంస్థ‌ల‌ను పెంచి పోషించాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే తెలుగు మీడియానికి ప్రాధాన్యం ఇవ్వాల‌న్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయిన‌ప్ప‌టికీ.. దీనిని రాజ‌కీయంగానే జ‌గ‌న్ తీసుకున్నారు.


ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో పాత విధానానికే మంత్రి లోకేష్ మొగ్గు చూపుతున్నారు. 2019కి ముందు ఎలాంటి ప‌రిస్థితి ఉండేదో.. అదే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బైజూస్ వంటి ప్రైవేటు కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఫ‌లితంగా ఇక పై పాఠ‌శాల‌ల్లో .. తెలుగు కు ప‌ట్టం క‌ట్ట‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: