క‌నుమూరు ర‌ఘురామ కృష్ణం రాజు ఎంత కాంట్ర‌వ‌ర్సీ పొలిటిషీయ‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ర‌ఘురామ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌తి ఎన్నిక‌కు ముందు పార్టీ మారుతూ వ‌స్తున్నారు. ఆయ‌న మ‌న‌స్త‌త్వం ఎక్క‌డా ఇమ‌డ లేని ప‌రిస్థితి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో ఉండేవారు. ఆ ఎన్నిక‌ల‌కు ముందు స‌డెన్ గా బీజేపీ లోకి చేరారు. ఆ త‌ర్వాత బీజేపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ లో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌ఘురామ ఎంపీగా గెలిచారు. వైసీపీ నుంచి ఎంపీ గా గెలిచిన యేడాది కే ఆ పార్టీతోనూ.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ తోనూ విబేధిండం ప్రారంభించారు ర‌ఘురామ . ఇలా ర‌ఘురామ‌ది ఎక్క‌డా ఇమ‌డ లేని మ‌న‌స్త‌త్వం అయిపోయింది.


చివ‌ర‌కు ఈ ఎన్నిక‌ల‌కు ముందు ర‌ఘురామ బీజేపీ లోకి వెళ‌తారా ?  లేదా ఏ పార్టీలోకి వెళ‌తారు ? అన్న స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ టీడీపీలో చేరారు. అది కూడా న‌ర‌సాపురం ఎంపీగా కాకుండా టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల పాటు జ‌గ‌న్ పై ఆయ‌న చేసిన పోరాటం నేప‌థ్యంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు కేబినెట్లో ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నారు. బాబు కేబినెట్లో ప‌ద‌వి రాలేదు.. అయితే బాబు ఒక మంత్రి ప‌ద‌విని మాత్రం అలా ఖాళీగానే ఉంచారు. ర‌ఘురామ‌కు స్పీక‌ర్ వ‌స్తుంద‌నుకున్నా రాలేదు.


ఇప్పుడు స్పీక‌ర్ ప‌ద‌వి రాలేదు.. అది అయ్య‌న్న పాత్రుడికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ర‌ఘురామ కు మంత్రి ప‌ద‌వి లేదా విప్ ప‌ద‌వుల‌లో ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని కూట‌మి ప్ర‌భుత్వ వ‌ర్గాలు చ‌ర్చించు కుంటున్నాయి. ఒక వేళ మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి కేబినెట్ లో ఎవ్వ‌రూ లేరు. క్ష‌త్రియ వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే ర‌ఘురామ‌కే వ‌స్తుంద‌ని లేని ప‌క్షంలో విప్ ప‌ద‌వి అయినా ఇవ్వాల‌ని బాబు డిసైడ్ అయ్యార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: