ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు టిడిపి పార్టీ .ఇప్పుడు తాజాగా పేదలకు సైతం 100 రోజులలో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అంటూ మంత్రి పార్థసారథి గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడి పలు విషయాలను తెలియజేస్తామంటూ తెలియజేశారు. ఏపీలో సంక్షేమం అభివృద్ధి తో పాటు అనేక సమస్యల పైన కూడా దృష్టి పెడుతున్నామంటూ తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా శ్వేత పత్రాలు ఢిల్లీ పర్యటనలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు అంటూ తెలిపారు.


అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నారని.. అన్ని జిల్లాలకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి మరి రాష్ట్రంలో ఉండే 8 లక్షల 4705 ఇల్లు వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. 5లక్షల 76,670 ప్రారంభానికి నోచుకోలేదని వెల్లడించారు మంత్రి పార్థసారథి. అందుకే రాబోయే రోజుల్లో 1,28,000 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అంటూ తెలిపారు.


మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇల్లు కట్టి పూర్తి చేస్తామని గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించాలన్న విషయాన్ని తమ దృష్టికి వచ్చిందని పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాతే వారి పైన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు పార్థసారథి మంత్రి. ఇసుక దొరకనీ ప్రాంతాలలో ఇసుక తరలింపు చేస్తామని రాష్ట్రంలో గృహ నిర్మాణం పైన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేస్తామంటూ తెలిపారు మంత్రి.. ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని గతంలో చేసిన పనులను సమీక్షించి ఏదైనా నిర్ణయం తీసుకొని వివరిస్తామంటూ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా వ్యవసాయ భూములలో ఇల్లు నిర్మించడమే కాకుండా గృహ నిర్మాణంలో ఉండే కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను కూడా తీసుకున్నారంటూ మంత్రి పార్థసారథి వెల్లడి.

మరింత సమాచారం తెలుసుకోండి: