ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డికి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అక్రమ కట్టడాలు జరిగాయని టిడిపి ఆరోపణలు చేస్తూనే ఉంది. విశాఖలో విలాస భవనాలను నిర్మించి... ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బును వృధా చేశాడని టిడిపి ప్రచారం చేస్తోంది. ఒక్కో బాత్రూం కి 26 లక్షల ఖర్చు చేశాడని... ఇటు... వైసిపి పార్టీ కార్యాలయాలను కూడా... ప్రభుత్వ స్థలాలలో కట్టారని టిడిపి అంటుంది.

 అంతేకాదు తాడేపల్లి  లో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. అటు విశాఖ, అనంతపురం, కడప ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా ఇష్యూ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అక్రమంగా కబ్జా చేసిన స్థలాలలో పార్టీ కార్యాలయాలను నిర్మించారని... అసలు పర్మిషన్ లేకుండా నిర్మించారని మరికొన్ని నోటీసులు జారీ చేసింది.

 ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసిపి. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు... ఈ పిటిషన్ విచారించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యాలయాలకు కూల్చివేతల విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని.. కోర్టు చురకలు అంటించింది. రెండు నెలల్లో భవనాల అనుమతులు రికార్డులను అధికారులకు ఇవ్వాలని... ఆదేశాలు కూడా ఇచ్చింది ఏపీ హైకోర్టు.

 అంతేకాదు తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత కట్టడాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి... స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఏపీ హైకోర్టు. కట్టడాల విషయంలో వైసిపి వాదన కూడా వినాలని వెల్లడించింది. అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరమైన... కట్టడాలు ఉంటే వాటిని ధ్వంసం చేయవచ్చని హై కోర్టు స్పష్టం చేసింది. ఇక ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ పార్టీ అలాగే తెలుగుదేశం కూటమి ఎలా  స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: