ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా  నాలుగవసారి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఇదే తరుణంలో  వారి యొక్క మార్కు పాలన కూడా మొదలుపెట్టారు.  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సెషన్ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. ఈ సమావేశాల్లో ప్రజాభివృద్ధిపై  సమస్యలు అమలు చేసే పథకాలపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాత  పథకాలు అమలు చేసే పనుల్లో పడ్డారు. అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు అనేక పథకాలు తీసుకువచ్చారు. కానీ పథకాలన్నీ అమలయ్యే విధంగా ఈసారి బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ పైనే అందరి ఆశలు కూడా ఉన్నాయి. మరి ఏ శాఖకు, ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు అనే వివరాలు చూద్దాం.. ఈ నెల మూడో వారంలో బడ్జెట్ పై అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

 అయితే వీరు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని చెప్పుకుంటూ వచ్చారో బడ్జెట్ లో డబ్బులు ప్రవేశపెడతారా,  అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే సాక్షి మీడియా గగ్గోలు పెడుతోంది. వైయస్సార్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. వీటికి అమ్మ వందనం, తల్లికి వందనం అనే పేర్లు మార్చేసి వాటిని అమలు చేయబోతున్నారు.  మరి ఈ పథకాలకు ఈ సంవత్సరం డబ్బులు ఇస్తారా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. అయితే జగన్ పాలన చేసినప్పుడు నవరత్నాలు అనే పథకాలపై మొట్టమొదటి ఏడాది నుంచే బడ్జెట్లో కేటాయించి అమలు చేయడం జరిగింది. దానికోసం ఆయన ఎలాంటి అప్పులు చేశారా, లేదంటే సంపద సృష్టించారా అనేది  అనేది తర్వాత విషయం, కానీ ఐదు సంవత్సరాలు  పథకాలు అమలు చేస్తూ వచ్చాడు. అయినా ఓడిపోయాడు.

ఇక జగన్ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి జగన్ పథకాలను పేర్లు మార్చి అలాగే కంటిన్యూ  చేస్తున్నారు. అయితే కొన్ని పథకాలు ఎన్నికలకు ముందు ఆగిపోయాయి.దీనికి సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ అయింది మరి ఆ పథకాలకు సంబంధించి వీరు ఎప్పుడు ప్రజలకు అందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ప్రతి మహిళకు 1500 రూపాయలు  అనేది కూడా ఎప్పుడు ఇస్తారు ఆసక్తికరంగా మారింది. అలాగే 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్, మరి ఇవన్నీ అమలు చేయడానికి బడ్జెట్ ఏ విధంగా కేటాయిస్తారు.  వీటిని అమలు  ఈ ఏడాది నుంచి చేస్తారా లేదంటే విడతల వారీగా చేసుకుంటూ వెళ్తారా అనేది బడ్జెట్ కేటాయింపుల వరకు తెలుస్తుంది. చంద్రబాబు కేటాయించే బడ్జెట్ మీదే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: