ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందుకు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితులు ప్రశాంతంగా మారుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మే 13వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఏకంగా ఈవీఎంలను పగలగొట్టడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.


 తెలుగుదేశం నేతలు పోలింగ్ బూతులను అన్యాయం చేసి రిగ్గింగ్ చేశారన్న కారణంతో ఏకంగా పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను పగలగొట్టారు. ఇక ఈ కేసులో పోలీసులు పిన్నెల్లి అరెస్టు ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ మళ్ళీ పోలీసులు అరెస్టు చేసి ఆయనను జైల్లోనే పెట్టారు. అయితే ఇలా పిన్నెల్లి అరెస్టు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తొలిసారి స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎంలు పగలగొట్టడానికి గల అసలు కారణమేంటి అనే విషయంపై సీఎం జగన్ షాకింగ్కామెంట్స్ చేశారు.


 పోలింగ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డుని పెట్టి బూతు నడుపుతున్నారని.. అటువంటి పరిస్థితుల్లో అటు పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ జరుగుతుందని అన్యాయం జరుగుతుందని భావించి పిన్నెల్లి ఇక సహించలేక ఈవీఎం  లను బద్దలు కొట్టారు అంటూ జగన్కామెంట్ చేశారు. అయితే పిన్నెల్లి ఎందుకు ఈవీఎం  బద్దలు కొట్టారు అన్న విషయాన్ని ఈసీ అర్థం చేసుకుని ఆయనకు బెయిల్ఇచ్చిందని.. కానీ పిన్నెల్లిని ఇలా ఈవీఎం బద్దలు కొట్టిన కేసులో కాకుండా మరో కేసు పెట్టి జైల్లో పెట్టారు అంటూ జగన్ ఆరోపించారు. ఈవీఎం  పగలగొట్టిన 10 రోజుల తర్వాత పిన్నెల్లి పోలింగ్ జరిగిన చోటుకు వెళ్లి హత్యాయత్నం చేశారంటూ అక్రమ కేసు పెట్టి పిన్నెల్లిని జైల్లో పెట్టారు అంటూ జగన్ ఆరోపించారు. ఒకరకంగా పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టడం మంచి పనే అన్నట్లుగా జగన్ మాట్లాడిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap