గతంలో వైఎస్ఆర్పి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి జనసేన నేతలను ఎంతలో ఇబ్బందులకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయాన్ని సాధించింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గతంలో వైసిపి తమ ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు ఉంటాయని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఎవరు కక్ష సాధింపుకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొన్న సమయంలో యువగలం పాదయాత్ర సమయంలో నేటి మంత్రి నారా లోకేష్ చెప్పిన రెడ్బుక్ వ్యవహారం తెరమీదకి వచ్చింది.


 అక్రమ కేసులు ఓవరాక్షన్ చేసిన అధికారులు, వైసిపితో అంట కాగీ తమ బాధ్యతలను సైతం మరిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఉన్నత స్థాయి అధికారుల పేర్లన్నీ కూడా ఈ రెడ్ బుక్కులో ఉన్నాయని.. ఇక ఈ డీటెయిల్స్ మొత్తం కలిపి లోకేష్ రెడ్బుక్ తయారు చేశారు అంటూ గతంలో టిడిపి నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనయించిన వారి లెక్కలు తెల్చే పుస్తకమే రెడ్బుక్ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఇక రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరిని టిడిపి ప్రభుత్వం టార్గెట్ చేయబోతుంది అన్న విషయం కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.


 అయితే లోకేష్ రెడ్ బుక్ పై ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ పేరుతో వైసిపి నేతలు అందరిని కూడా టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారు అంటూ జగన్ ఆరోపించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసిపి ఆఫీసులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటివి వెంటనే ఆపాలి అంటూ డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. వైసీపీ నేతలు పై జరుగుతున్న దాడులపై తాము న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: