ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి కార్యాలయాలను సైతం కూల్చివేసే పనిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది టిడిపి ప్రభుత్వం.. దీంతో వైసిపి పార్టీ ఏపీ హైకోర్టులో కేసు వేయగా తాజాగా బిగ్ రిలీఫ్ దొరికినట్లుగా తెలుస్తోంది. వైసీపీ కార్యాలయాలను కూల్చివేతపై స్టేట్ కో యధాతధంగా కొనసాగించాలంటూ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్రమాదకరంగా ఉంటే తప్ప ఎటువంటి పరిస్థితులలో కార్యాలయాలను కూల్చకూడదు అంటూ న్యాయస్థానం తీర్పు చెప్పినట్లుగా తెలుస్తోంది.


టిడిపి నేతలు సైతం ఎప్పుడెప్పుడు వైసీపీ కార్యాలయాలను కూలుస్తామా అని తహతలాడుతున్న సమయంలో హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైసిపి కేంద్ర కార్యాలయానికి అనుమతులు లేవని కారణంగా చంద్రబాబు సర్కార్ వాటిని కూల్చిన సంగతి తెలిసిందే ఇదే రీతిలోనే రాష్ట్రవ్యాప్తంగా చాలా వైసిపి కార్యాలయాలను కూల్చే పనిలో ఉన్నది. అంతేకాకుండా రాత్రికి రాత్రే ప్రభుత్వం వివరాలను తెప్పించి వారికి నోటీసులు కూడా అందజేసి కూల్చేస్తూ  ఉండడంతో వైసిపి హైకోర్టును సైతం ఆశ్రయించింది. దీంతో ఎన్నో దఫాలు విచారణ అనంతరం ఈ రోజున తీర్పు వెలువడింది.


వైసిపి కార్యాలయాలు కూల్చివేతను తక్షణమే ఆపివేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు కూడా మరో రెండు నెలలు గడువు వైసీపీ పార్టీకి ఇవ్వాలి అంటూ న్యాయస్థానం సూచించింది. అంతేకాకుండా ఆ కార్యాలయాలు ప్రజలకు ఇబ్బంది కలిగితే తప్ప ఎటువంటి పరిస్థితులు కూల్చడానికి వీలు లేదంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో అటు వైసిపి నేతలు కార్యకర్తలు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వైసిపి కార్యాలయాలు కూల్చివేత పైన చట్టం నిబంధనలను సైతం అనుసరించాలి అంటూ హైకోర్టు వెల్లడించింది. మరి ఈ విషయం అటుకూటమి ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో చూడాలి మరి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: