2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో అప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధికారం పోయి వైసీపీ పార్టీకి అధికారం వచ్చింది. దానితో వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపై ఎంతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అని, కొంతమంది అధికారులు కావలసుకొనే తెలుగుదేశం నేతలపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని నారా లోకేష్ అనేక సార్లు చెప్పుకొచ్చారు.

అలా కొన్ని సార్లు చెప్పిన తర్వాత లోకేష్ ప్రస్తుతం ఒక రెడ్ బుక్ రాస్తున్నాను. అది ఎందుకు అనుకుంటున్నారా ..? అందులో వైసిపి పార్టీకి తొత్తులుగా పని చేస్తూ ప్రజలకు , టిడిపి పార్టీ నేతలకు , కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తుల పేర్లు ఇందులో రాస్తూ ఉంటాను. అవి వైసిపి పార్టీ నేతలవి కావచ్చు, కార్యకర్తలవి కావచ్చు, వారికి తొత్తులుగా పనిచేసే ప్రభుత్వ అధికారులవి కూడా కావచ్చు. ఇలా రాస్తూ వస్తాను. ఎలాగో 2024 వ సంవత్సరం మేమే అధికారంలోకి రాబోతున్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తాను. అందులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఒక్కొక్కరికి చట్ట ప్రకారంగా ఏం జరగాలో జరిపిస్తాం అని చెప్పాడు. ఇకపోతే 2024 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పెద్ద మొత్తంలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.

తెలుగుదేశం అధికారంలోకి కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక నారా లోకేష్ మరికొన్ని రోజుల్లోనే తాను ఐదు సంవత్సరాల పాటు రాసుకున్న రెడ్ బుక్ ను ఓపెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో అనేక మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రి అయినటువంటి విడుదల రజిని పేరు కూడా ఈ బుక్ లో ఉండే అవకాశం ఉన్నట్లు చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈమె ఎన్నో సార్లు తెలుగు దేశం పార్టీ నేతలపై మాటల యుద్ధం చేసింది. దానితో కచ్చితంగా లోకేష్ ఈమె పేరు రెడ్ బుక్ లో రాసి ఉంటాడు అని , ఒక వేళ రాసినట్లయితే ఈమె పై నారా లోకేష్ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: