ఇటివలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచిన ఎగ్జిట్ పోల్ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్.. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల ఈయన ఎగ్జిట్ పోల్స్ 100 కి 100% నిజం అవడంతో ఈయనకి ఎక్కువగా ప్రాధాన్యత పెరిగిపోయింది. ముఖ్యంగా గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కి 65 సీట్లు వస్తాయని అంచనా వేశారు. 64 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ కోసం చాలా మీడియా సంస్థలు సాధారణ ప్రజలు కూడా ఎంత ఎక్సైటింగ్గా ఎదురు చూశారు


వైసీపీకి మరొకసారి విజయం సాధిస్తుందని 94 నుంచి 104 స్థానాలు వస్తాయని వెల్లడించారు.. దీనికి మరో 10 స్థానాలు ఎక్కువైనా రావచ్చు కానీ తక్కువ వచ్చే పరిస్థితి లేదని తెలియజేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చాలా ఘోరంగా అంచనాలు తప్పడం జరిగింది. ఎన్నికల ఫలితాల ముందు మీడియా సంస్థలు కనిపించిన ఆరా మస్తాన్ ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించడం లేదు.. మళ్లీ కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఆరం మస్తాన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. తాను నిజాలే చెబుతానంటూ భగవద్గీత ఖురాన్ పైన కూడా ప్రమాణం చేయడం జరిగింది. ముఖ్యంగా వైయస్ జగన్ ని తాను ఎప్పుడు కలవలేదని.. అలాగే తాను ఎప్పుడు ఎన్నికల కోసం కలవలేదని కూడా తెలియజేశారు. జగన్ తరుపున తనను ఎవరూ కూడా సంప్రదించలేదని కూడా వెల్లడించారు.కానీ ఏపీలో ఉన్న కొంతమంది నేతలు వ్యక్తిగతంగా తనతో సర్వే చేయించుకున్నారని తెలియజేశారు. వైసిపి పార్టీకి అనుకూలంగా సర్వే ఇవ్వాలని  మిమ్మల్ని ఎవరైనా కోరారా అని యూట్యూబ్ యాంకర్ అడగగా.. ఆరా మస్తాన్ అలాంటిదేమీ లేదంటూ తేల్చి చెప్పారు..



తనకు తెలిసి జగన్ వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదని ఒకరిని పిలిచి తనకు అనుకూలంగా ఉండమని చెప్పే మనస్తత్వం కాదని కూడా తెలిపారు.. అలా అయితే పార్టీని విడిపోయిన వల్లభనేని బాలశౌరి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, RRR, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితర నేతలను జగన్ పిలిపించి మాట్లాడేవారు కదా అంటూ ఆరా మస్తాన్ తెలియజేశారు. వారందరిని వదులుకున్నారని తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కలిసి వచ్చిన తర్వాత కూటమికి బాగానే కలిసొచ్చిందని తెలియజేశారు ఆరా మస్తాన్ అది తన అభిప్రాయంగా తెలిపారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: